Stone River : ‘రాళ్ల నది’.. గ్లాసుడు నీళ్లు కూడా కనిపించని వింత నది..

కనుచూపు మేర నీటి జాడే కనిపించని వింత నది. ఈ నదిలో కేవలం రాళ్లు మాత్రమే కనిపిస్తాయి.10 టన్నులుండే పెద్ద పెద్ద రాళ్లు మాత్రమే కనిపించే ఈ నదిని చూడటానికి ఎంతోమంది వస్తుంటారు.

Stone River : ‘రాళ్ల నది’.. గ్లాసుడు నీళ్లు కూడా కనిపించని వింత నది..

Stone River

russia Stone River : నది అంటే నీళ్లు..మధ్య మధ్యలో కనిపించే అందాల ఇసుక తిన్నెలు. గలగలపారే నీళ్లు. కానీ ఓ నదిలో అటువంటివేమీ కనిపించవు. కనుచూపు మేర నీటి జాడే కనిపించదు. అంటే నదిలో నీళ్లు లేవేమో..వర్షకాలం మాత్రమే కనిపిస్తాయోమే అనుకుంటున్నారా..? అలా ఏం కాదు. ఈ నదిలో కేవలం రాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కనీసం గ్లాసుడు నీళ్లు కూడా కనిపించవు. కనుచూపు మేర రాళ్లు పెద్ద పెద్ద బండరాళ్లు కనిపిస్తాయి. అందుకే దీన్ని ‘రాళ్ల నది’ (Stone River)అని రాళ్ల పరుగు (Stone Run) అని పిలుస్తారు.

సాధారణంగా నదుల్లో నీళ్లు ఉన్నా..గలగలా ప్రవహిస్తున్నా నీరు లేని చోట అక్కడక్కడా రాళ్లు కూడా కనిపిస్తాయి. కానీ నదిలో మాత్రం నీటి జాడే కనిపించదు. అందుకే దీన్ని ‘బిగ్‌ స్టోన్‌ రివర్‌’ అనిపిలుస్తారు. ఈ రాళ్ల నదిలో దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు కేవలం పెద్ద పెద్ద బండరాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అదికూడా ఎవరో చక్కగా పేర్చినట్లుగా కనిపించే రాళ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నదిలో ఉండే రాళ్లు ఒక్కోటి 10 టన్నుల బరువు ఉంటాయి. ఈ రాళ్ల నది చుట్టు పక్కల అంతా దేవదారు వక్షాల దట్టమైన అడవి ఉంటుంది. ఈ అడవిలో విభిన్నమైన జీవరాశులు జీవనం సాగిస్తున్నాయి.

రాళ్ల నదిగా పిలిచే ఈ స్టోర్ రివర్ (Stone River) రష్యా(russia )లో ఉంది. రష్యాలోని యూరల్స్‌లోని టాగనేయ్‌ పర్వతాల్లో (Urals Tagne Mountains in Russia)పుట్టి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆ ఆరు కిలోమీటర్లలో ఒక్కో చోట ఒక్కో వెడల్పుతో కనిపించి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్కోచోట 200 మీటర్ల వెడల్పు ఉంటే మరికొన్ని చోట్ల 700 మీటర్ల వరకు ఉంటుంది. అలా ఆరు కిలోమీటర్ల పాటు కనుచూపు మేర రాళ్లు తప్ప గ్లాసుడు నీళ్లు కూడా కనిపించవు.

Crocodiles River : ఓరి నాయనో ఇది మొసళ్ల లోకమా ఏంటీ..? పట్టు తప్పి పడితే ఎముకలు కూడా మిగలవు

నీళలు లేకపోతే నది అని ఎలా అంటాం అనే సందేహం వచ్చి తీరుతుంది.అది నిజం నదే. కానీ రాళ్లు కిందుగా నది ప్రవహిస్తుంటుంది.నీటి ప్రవాహం అంతా ఆ పెద్ద పెద్ద బండరాళ్ల కిందుగా ప్రవహిస్తుంటుంది. దగ్గరకు వెళితే గలగలామని నీటి సవ్వడి తెలుస్తుంది. కానీ ఈ నదికి సంబంధించి మరో విచిత్రం ఏమిటంటే ఈ నదిలో నీళ్లు ఎప్పుడు రాళ్లను దాటి అంటే అవి మునిగేలా ప్రవహించలేదట. నదిలో నీళ్లు రాళ్లను దాటి బయటకు రాలేదట. ఈ ప్రకృతి కొలువైన వింతల్లో ఈ రాళ్ల నదికూడా ఒకటి. ఈ రాళ్ల నదిని చూడటానికి ఎంతోమంది పర్యాటకు భారీ సంఖ్యలో వస్తుంటారు.

ఇలా ఎందుకుందీ..?
10,000 ఏళ్ల క్రితం నుంచే ఆ రాళ్లు ఉన్నాయిని శాస్త్రవేత్తలు  చెబుతున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. అప్పట్లో టాగనేయ్‌ పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేవి. ఆ పర్వతాలు 15 వేల అడుగులకు పైగా ఎత్తుండేవి. మంచు బరువు వల్ల రాళ్లు, ముక్కలు ముక్కలై కాలక్రమంలో మంచు కరగడం ప్రారంభమైన తర్వాత రాళ్లన్నీ బయట పడ్డాయి. నీటి ప్రవాహ వేగానికి అవన్నీ జారుతూ నదిలో పేర్చినట్లుగా పేరుకుపోయాయి.

Viral News : పూడ్చిన శవపేటిక నుంచి శబ్దాలు, తెరిచి చూస్తే శవం నిండా గాయాలు..

ఈ నదిలో ఉండే రాళ్లలో సిలికా, ఐరన్‌ ఉందని గుర్తించారు. అందుకే ఇవి మెరుస్తూ కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే నదిలో రాళ్లు ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతుంది. కానీ నిజానికి రాళ్లు కదలకుండా అలాగే స్థిరంగా ఉంటాయి. కానీ నీరు మాత్రం కిందనుంచి ప్రవహిస్తుంటుంది.