Koel Birds : కోకిల కాకి గూట్లో గుడ్లు పెట్టటానికి అసలు కారణం

అన్ని పక్షులు గుడ్లు పెట్టే సమాయానికి గూడును తయారు చేసుకుంటాయి. ఆ గూట్లోనే గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తాయి. ఆ తరువాత ఆ పిల్లలకు రెక్కలు వచ్చి ఎగరగలిగేంత వరకు పోషిస్తాయి. ఇలా పక్షి జాతుల్లో ఏ పక్షి అయినా గూడు కట్టుకుని ఆ గూట్లోనే గుడ్లు పెడుతుంది. కానీ కోకిల మాత్రం అలా కాదు వేరే పక్షి గూట్లో తన గుడ్లు పెడుతుంది. ఎందుకు..? కారణమేంటీ..?

Koel Birds

koel birds Eggs : కోకిల పేరు వినగానే కమ్మని కంఠంతో వినసొంపుగా కుహూ కుహూలు గుర్తుకొస్తాయి. కోకిల అంటే వసంత రుతువు గుర్తుకొస్తుంది. కోకిల అంటే తెగులు వారి పండుగ ఉగాది గుర్తుకొస్తుంది. కోకిల పేరు ఉంటే ఇన్ని గుర్తుకొస్తాయి కదా.. మరి కోకిల గురించి, కోకిల గుడ్లు గురించి మీకు తెలుసా..? కోకిల కాకి గూట్లో గుడ్లు పెడుతుంది అని పెద్దలు అంటారు. సాధారణంగా అన్ని పక్షులు గుడ్లు పెట్టే సమాయానికి గూడును తయారు చేసుకుంటాయి. ఆ గూట్లోనే గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తాయి. ఆ తరువాత ఆ పిల్లలకు రెక్కలు వచ్చి ఎగరగలిగేంత వరకు పోషిస్తాయి. పిల్లలకు చక్కగా రెక్కలు వచ్చి ఎగిరిపోయాక తల్లి పక్షి తన జీవితం తాను జీవిస్తుంది. ఇలా ఏ పక్షి జాతుల్లో ఏ పక్షి అయినా గూడు కట్టుకుని ఆ గూట్లోనే గుడ్లు పెడుతుంది.

కానీ కోకిల అలా కాదు. కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెడుతుంది. దీనికి ఓ కారణం ఉంది.ఎందుకంటే దానికి గూడు కట్టుకోవటం రాదు..అలాగే గుడ్లు పొదగటం చేతకాదు. అందుకే కాకితో పాటు ఇతర పక్షుల గూట్లో తన గుడ్లు పెడుతుంది. గూడు కట్టుకోవటం రాదు,గుడ్లు పొదగటం కూడా చేతకాని కోకిల తన గుడ్లు, పిల్లల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయదు. ఏ గూట్లో అయితే తన గుడ్డు పెట్టిందో ఆ గూడుమీద ఓ కన్నేసి ఉంచుతుంది. నిత్యం ఆ గూడును గమనిస్తుంటుంది.

Great Bird : బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేసే పక్షి, సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని పక్షి

ఒక్కో పక్షి గూట్లో ఒక్కో గుడ్డు పెడుతుంది. అలా ఏ గూట్లో అయితే తన గుడ్లు పెడుతుందో ఆ గూళ్లను నిత్యం పరిశీలిస్తుంది. సాధారణంగా కోకిల కాకి గూట్లోనే తన గుడ్లను పెట్టటానికి ఇష్టపడుతుందట. దానికి కారణం కాకి నల్లగానే ఉంటుంది. కోకిల కూడా నల్లగానే ఉంటుంది. గుడ్డు నుంచి పిల్లలు బయటకు వచ్చాక కాకి పిల్లలు..కోకిల పిల్ల ఒక్కలాగానే ఉంటుంది. వాటికి అరిచే గొంతు వచ్చే వరకు కాకి పిల్లలకు..కోకిల పిల్లలకు తేడా తెలియదు. తేడా తెలిసాకే కాకి కోకిల పిల్లను తరిమేస్తుంది. అప్పటి వరకు కోకిల తను గుడ్డు పెట్టినప్పనుంచి పిల్ల అయి కాకి తరిమేసే వరకు గమనిస్తుంటుంది.కాకి తన పిల్లలను తరిమేసే సమయంలో తన పిల్లను తానే సంరక్షించుంటుంది.

అలా కోకిలకు కమ్మని కంఠం ఉన్నా..తన స్వయంతో అందరిని అలరించే గుణం ఉన్నా దానికి సొంతంగా గూడు పెట్టుకోవటం చేతకాదు. కాకి ఇతర పక్షుల గూటిలో తన గుడ్లు పెడుతుంది. ఆ పక్షులకు తెలియకుండా ఆ గూళ్లలో గుడ్డు పెట్టేసి వచ్చేస్తుంది. ఇక్కడ కోకిల తెలివితేటలను గుర్తించాల్సి మరో విషయం ఉంది. తను ఏగూటిలో అయితే గుడ్డు పెడుతుందో..అప్పటికే ఆ గూటిలో ఉండే కాకి లేదా ఇతర పక్షుల గుడ్లలో ఒక గుడ్డును తీసి బయటపారేస్తుంది. లేదా తినేస్తుంది. తన గుడ్డును ఆ గుడ్లలో కలిపేస్తుంది. ఆ పక్షికి ఎటువంటి అనుమానం రాకుండా. తన గుడ్డును పారేయకుండా..

ఆ విషయం తెలియని కాకి.. తన గుడ్లతో పాటు వాటిని కూడా పొదుగుతుంది. పిల్లలు బయటకు వచ్చే వరకు దానికి అసలు సంగతి తెలియదు. పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చాక అరుపును బట్టి కాకి పిల్లల్లో వేరే జాతి పిల్ల ఉందని గుర్తించి పొడిచి తరిమేస్తుంది. అప్పటి వరకు వేచి చూస్తున్న కోకిల తన పిల్లను అక్కున చేర్చుకుని అది దాని అంతటి అది ఆహారం సంపాదించుకునే వరకు సంరక్షిస్తుంది.

Crow : కాలజ్ఞాని కాకి అరుపులో గొప్ప సందేశం, కాకి జీవితం మానవులకు కూడా ఆదర్శం

కోకిలలు కేవలం కాకులనే కాదు.. ప్రధానంగా ఎనిమిది రకాల పక్షులను ఎంచుకుని, వాటి గూళ్లలో తమ గుడ్లు పెడుతుంటాయని శాస్త్రవేత్తలు గురించారు. కోకిల గుడ్ల రంగులోనే గుడ్లు పెట్టే పక్షుల గూడునే ఇవి ఎంచుకుంటాయి. ఎందుకంటే గుడ్లలో తేడా కనిపిస్తే ఆ పక్షులు ఆ గుడ్డును పొదగవు. పారేస్తాయి. లేదా తినేస్తాయి. అందుకే కోకిల అటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. పైగా తాను గుడ్డు పెట్టిన గూటిలో ఉండే ఆ పక్షి గుడ్లలో ఓ గుడ్డును పారేస్తుంది. లేదా తినేస్తుంది. తన గుడ్డును ఆ గుడ్లలో కలిపేస్తుంది. అలా కోకిల తన గుడ్లను పొదగటానికి..పిల్లల్ని చేయటానికి ఇతర పక్షులపై ఆధారపడుతుంది. అదన్నమాట కాకి గూట్లో కోకిల గుడ్లు పెట్టటానికి కారణం..

కాగా ఇక్కడ ఇతర గూళ్లలో ఆడకోకిల గుడ్లు పెట్టటానికి మగ కోకిల చక్కటి సహకారాన్ని అందిస్తుంది. ఏ గూటిలో గుడ్డు పెట్టాలో మగ కోకిల పరిశీలిస్తుంది. ఏగూటిలోగుడ్డు పెడితే అది సురక్షితంగా ఉంటుందో..ఆ గూడును ఎంపిక చేసే బాధ్యత మగకోకిలే తీసుకుంటుంది. అలా మగ కోకిల సహకారంతో..సలహాతో ఆడ కోకిల ఆ గూటిలో గుడ్డు పెట్టేసి వస్తుంది ఏమీ తెలియనట్లుగా..

కాగా కుహూ కుహూ అంటే కమ్మగా కూసే కోకిలను సాధారణంగా కోకిలమ్మ అంటాం. కోకిలమ్మ అంటే ఆడకోకిల కూయదు. మనం వినే కుహూ కుహూ అనే కమ్మని కంఠస్వరం కోకిలమ్మది కాదు కోకిలయ్యది. అంటే మగకోకిలది. మగ కోకిల మాత్రమే కమ్మనికంఠంతో కుహూ కుహూ అని కూస్తుంది. ఆడకోకిల కంఠం పెద్దగా ఉండదు. మగ కోకిల కుహూ కుహూ అని కూస్తే ఆడకోకిల మాత్రం కీక్, కీక్ అని అరుస్తుంది.

కోకిల గురించి మరిన్ని వివరాలు..
కోకిలలను భారత్ లోనే కాక ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో నివసిస్తాయి.
ఆసియా కోకిల లేక కోయిల వలసపక్షి..
వేసవి ప్రారంభం కాగానే సింగపూరు ప్రాంతాలనుంచి భారత్ కు వచ్చి భారత్ సరిహద్దుల్లోని నేపాల్ పర్వత ప్రాంతాల్లో పునరుత్పత్తి జరిపి మళ్ళీ వెనక్కి వెళ్లి పోతాయి.

మగకోయిల నల్లగా, కాస్త నీలం రంగుతో, ఎర్రని కళ్ళతో ఉంటుంది. మగకోయిలకు సిగ్గు ఎక్కువ.. అందుకే
చెట్ల కొమ్మలమధ్య నక్కి కపించకుండా కూర్చుని కుహూ కుహూ అని కూస్తుంటుంది.
ఆడ కోకిల గచ్చకాయరంగు, రెక్కల మీద ఊదారంగు చుక్కలతో ఉంటుంది. మగపక్షి కన్నా కాస్త పెద్దగా ఉంటుంది.
కోకిలలు సుమారు 12ఏళ్లు జీవిస్తాయి..
గూళ్లు కట్టుకోలేకపోవటంతో తమ గుడ్లను పెట్టటానికి..పిల్లల్ని పొదగటానికి ఇతర పక్షులపై ఆధారపడతాయి..
పండ్లు, కీటకాలు వీటి ఆహారం..మానవులకు విషతుల్యమైన పండ్లను కూడా తిని జీర్ణించుకోగలవు..
వసంత కాలంలో మాత్రమే కోకిల కూత వినిపిస్తుంది. అదీకూడా మగపక్షులే కూస్తాయి..
భారతీయులకు ఇష్టమైన ముఖ్యమైన పండుగ ఉగాది సమయంలో కోకిల కూతలు అత్యంత ప్రసిద్ధి చెందినవి..