Shashi Tharoor : అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. కేరళ స్టైల్ దాండియా.. అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ వైరల్

'అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్ .. కేరళ స్టైల్ దాండియా' అంటూ కాంగ్రెస్ నేత శశీథరూర్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళ మహిళలు దాండియా ఆడే స్టైల్ చాలా వెరైటీగా ఉంది.

Shashi Tharoor ‘dandiya Kerala style’

Shashi Tharoor dandiya Kerala style : ‘అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్..కేరళ స్టైల్ లో దాండియా నృత్యం’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా దాండియా ఆట ఆడేవాళ్లు చిన్న చిన్న కర్రలతో ఆడతారు. కానీ శశిథరూర్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో దాండియా ఆడే మహిళలు భిన్నంగా పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని చాలా చాకచక్యంగా దాండియా డ్యాన్స్ చేస్తున్నారు. దాండియా ఆడే మహిళలు కేరళ సంప్రదాయం చీరకట్టులో చక్కగా ఆడుతున్నారు.

దశమి నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేరళలో కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో సంస్కృతి సంప్రదాయాల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. పండుగ ఒక్కటే అయినా ఆయా ప్రాంతాల్లో చాలా భిన్నమైన పద్ధతుల్లో చేసుకుంటారు. అలాగే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నవరాత్రుల సందర్భంగా దాండియా నృత్యం చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లోని గుజరాతీలు సైతం దాండియాను ఎంతో సంతోషంగా ఆడుతూ నవరాత్ర ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు.

Also Read : తాగి వాంతి చేసుకుంటే భారీ జరిమానా.. జేబులు ఖాళీయే

నవరాత్రుల సందర్భంగా కేరళలో మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోను కాంగ్రెస్ నేత శశిథరూర్‌ ట్వీట్ చేశారు. శశిథరూర్ కేరళకు చెందిన వారనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ‘అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. ఈ నవరాత్రులకు కేరళ స్టైల్లో దాండియా నృత్యం’ అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోపై నెటిజన్స్ కూడా తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వెరైటీ దాండియా నృత్యంపై ఓ లుక్కేయండి.

గతంలో కూడా శశీథరూర్ కేరళకు ప్రత్యేకమైన ఓనం వేడుకలు సందర్భంగా ఊయల ఊగుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ఓనం వేడుకల్లో పాలుపంచుకున్న ఆయన సంప్రదాయ దుస్తులు ధరించి, ఉయ్యాలలో ఊగుతున్న వీడియోను పోస్ట్ చేశారు.

Also Read: అమ్మాయిని ఆ కంపెనీ పెన్సిల్‌తో పోల్చిన అబ్బాయి.. ఫిదా అయిపోయిన చిన్నది