Restaurant Vomit Fees : తాగి వాంతి చేసుకుంటే భారీ జరిమానా .. జేబులు ఖాళీయే

పీకల దాకా తాగి ఆ తరువాత కక్కితే భారీ జరిమానా తప్పదని హెచ్చరించింది ఓ రెస్టారెంట్. తాగండీ కానీ ఇక్కడ కక్కకండీ వాంతి చేసుకుంటే జరిమానా కట్టాల్సిందే అంటూ రూల్ పెట్టింది.

Restaurant Vomit Fees : తాగి వాంతి చేసుకుంటే భారీ జరిమానా .. జేబులు ఖాళీయే

restaurant 'vomit fees' to customers (1)

restaurant ‘vomit fees’ to customers : మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నా తాగటం మాత్రం మానటంలేదు మందుబాబులు. కొంతమంది అతిగా తాగటం తరువాత కక్కటం చేస్తుంటారు. బారుల్లోను..పబ్బుల్లోను ఇటువంటివి జరుగుతుంటాయి. అలా పీకల దాకా తాగటం తరువాత కక్కటం దీంతో అక్కడ పనిచేసేవారికి శుభ్రం చేయటం చికాకుగా ఉంటుంది. బహుశా అందుకేనేమో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఓ వినూత్న రూల్ పెట్టింది. తాగండీ కానీ ఇక్కడ కక్కకండీ అంటే .. ‘వాంతి’చేసుకోకండీ..ఒకవేళ వాంతి చేసుకుంటే జరిమానా కట్టాల్సిందే అంటూ రూల్ పెట్టింది. సో..ఆ రెస్టారెంట్ మద్యం తాగి వాంతి చేసుకుంటే జేబులు ఖాళీ కావటం ఖాయం అన్నమాట..

అమెరికాలోని కాలిఫోర్నియాఓ రెస్టారెంట్ ఈ వినూత్న రూల్ పెట్టింది. మద్యం తాగి వాంతి చేసుకుంటే రూ.50 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.4వేలు పైనే కట్టాలని రూల్ పెట్టింది. కాలిఫోర్నియాలోని శానిఫ్రాన్సిస్కో నగరంలో 16వ స్ట్రీట్ కిచెన్ స్టోరీ అనే రెస్టారెంట్ ఈ రూల్ విధించింది. జరిమానా కట్టకూడదనుకునేవారు లిమిట్స్ లో ఉండాలని వాంతులు చేసుకోవద్దని సూచించింది.అంతేకాదు పరిశుభ్రత ముఖ్యం అంటూ రెస్టారెంట్ ఆవరణలో కస్టమర్లు చెత్తవేస్తే జరిమానా తప్పదని వార్నింగ్ ఇచ్చింది. కాగా శానిష్రాన్సిస్కో నగరం పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న అందమైన నగరంగా పేరొందింది.