Indian street dog to Italy : భారతీయ వీధికుక్కకు ఇటలీ పాస్‌పోర్ట్ .. వారణాసి శునకానికి విదేశీయోగం వెనుకున్న కధ ఇదే..

భారతదేశంలోని ఓ వీధికుక్కకు విదేశీయోగం పట్టింది. వారణాశిలో వీధుల్లో తిరిగే కుక్క ఇటలీ వెళ్లనుంది. దీని వెనుక ఓ మహిళ పెద్ద మనస్సు ఉంది. వీధికుక్కపై పెంచుకున్న స్నేహం ఉంది.

Indian street dog to Italy : భారతీయ వీధికుక్కకు ఇటలీ పాస్‌పోర్ట్ .. వారణాసి శునకానికి విదేశీయోగం వెనుకున్న కధ ఇదే..

Varanasi street dog to Italy

Updated On : July 11, 2023 / 10:14 AM IST

Indian Varanasi street dog to Italy : చాలామంది భారతీయులకు విమానం ఎక్కి విదేశాలకు వెళ్లాలని ఉంటుంది. కానీ అందరికి కుదరకపోవచ్చు. పైగా ఖర్చుతో కూడుకున్నది కూడా. కానీ భారతదేశంలోని ఓ వీధికుక్కకు రాజయోగం పట్టుకుంది. పెంటకుప్పలమ్మట దొరికింది తిని కడుపు నింపుకుని జీవించే వీధికుక్క(Indian stray dog)కు ఇటలీ (Italy )వెళ్లే అదృష్టం పట్టుకుంది. లక్ లక్కలాగా అతుక్కుంది ఆ వీధికుక్కకు. మరి విదేశాలకు వెళ్లాలంటే మనుషులకే కాకు జంతువులకు కూడా పాస్ పోర్ట్ కావాలి. ఇటలీ వెళ్లనున్న ఆ వీధి కుక్కకు పాస్ పోర్టు కూడా వచ్చేసింది. ఇంకనే చక్కగా విమానం ఎక్కి గగనవిహారంతో ఇటలీ (Italy )లో ల్యాండ్ అవ్వనుంది. ఇంతకీ భారతదేశంలో వీధికుక్కేంటీ..? (Indian stray dog)విదేశాలకు వెళ్లటమేంటీ..దీని వెనుకున్న ఆ కథా కమామీషు ఏంటబ్బా..అనే డౌట్ వస్తుందికదా..

అసలు విషయం ఏమిటంటే..గత కొంతకాలం క్రితం ఇటలీ (Italy )నుంచి ఓ మహిళ భారతదేశానికి వచ్చింది. భారత్ లోని దేవాలయాలు అన్నా అక్కడి చరిత్ర అన్నా విదేశీయులకు చాలా ఆసక్తి..ఆ చరిత్ర తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఆ చరిత్ర..ఆ చారిత్రాత్మక ప్రదేశాల వెనుకున్న వింతలు..విశేషాలు..ఆసక్తికర అంశాలు తెలుసుకున్న చాలామంది విదేశీయలు కాశీ, అరుణాచలం, హిమాచల్ ప్రదేశాల్లో ఉండే ప్రవిత్ర పుణ్యక్షేత్రాల్లో సెటిల్ అయ్యేవారు చాలామంది ఉంటారు. ఆయా ప్రాంతాలపై పరిశోధనలు చేస్తుంటారు కూడా..

Pakistani woman Seema Haider : హిందూమతం స్వీకరించాను, పాక్‌కు తిరిగి వెళ్లను…సీమాహైదర్ వెల్లడి

అలా ఇటలీకి చెందిన వెరా లాజారెట్టి అనే ఓ మహిళా రచయిత్ర (Italian writer Vera Lazzaretti)గత కొంతకాలం క్రితం వారణాశి (Varanasi)వచ్చారు. అదే గత పదేళ్లుగా పరిశోధనల (Research)కోసం భారత్ వస్తున్నారు.ఈ క్రమంలో యూపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాశిలో ఎక్కువగా విడిది చేస్తుంటారు. అలా ఆమెకు ఆ ప్రాంతంలో ఉండే ఓ వీధికుక్కను చేరదీసింది. దానికి రోజు ఆహారం పెడుతుండేది. ఆ వీధి కుక్క (stray dog)కూడా ఆమెతో స్నేహంగా ఉండేది. దానికి ఎవరైనా కొడితే సహించేవారు కాదు ఆమె. అలా వారిద్దరి మధ్యా ఆత్మీయత పెరిగింది. దీంతో ఆమె ఆ వీధికుక్కను దత్తత తీసుకున్నారు. దానికి మోతి (Moti )అని పేరు కూడా పెట్టుకున్నారు. అలా మోతీని వదిలి వెళ్లలేక ఆమె తనతో పాటే ఇటలీ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దీనికోసం ఆమె స్థానిక అధికారులను సంప్రదించారు. భారత్ కు చెందిన జంతువైనా అది వీధి కుక్కైనా సరే విదేశాలకు తీసుకెళ్లాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీంతో దానికి సంబంధించిన అన్ని పేపర్ వర్కులను ఆమె పాటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాక స్థానిక అధికారుల అనుమతి పత్రాలు పొందాక ఆమె ఆ వీధికుక్కను తనతో పాటు ఇటలీకి తీసుకెళ్లనున్నారు. మోతీకి టీకాలు వేయించారు. అన్ని విధాలుగా అనుమతి పత్రాలు పొందారు.

Manipur Violence: హింసను పెంచడానికి కోర్టును ఉపయోగించుకోకూడదు.. మణిపూర్ అల్లర్లపై సుప్రీం

అనుమతుల్లో భాగంగా మోతీకి ఇటలీ తీసుకెళ్లేందుకు పాస్ పోర్టు (Passport)కూడా వచ్చేసింది. మోతీకి మైక్రో చిప్ కూడా అమర్చారు అధికారులు ఫార్మాలిటీలో భాగంగా..అలా వెరా..మోతీల అనుబంధానికి ప్రతీకగా జులై 13న మోతీ వారణాశి నుంచి ఇటలీ బయలుదేరనుంది. అలా ఎక్కడో ఇటలీలో పుట్టిన ఆమెకు భారతీయ వీధికుక్కమీద అభిమానం పెంచుకోవటం..ఓ వీధికుక్కకు ఇటలీ వెళ్లే అవకాశం కలగటం అనేది విశేషమనే చెప్పాలి.