చూపుడు వేలిపై కూర్చున్న ఈ అత్యంత అరుదైన జంతువు ఎక్కడ కనపడిందో తెలుసా?

మొదట దాన్ని గినియా పంది పిల్లగా భావించారని తెలిపారు. నిపుణులు దాన్ని చూశాక మార్సుపియల్ మోల్ గా నిర్ధారించారని చెప్పారు.

చూపుడు వేలిపై కూర్చున్న ఈ అత్యంత అరుదైన జంతువు ఎక్కడ కనపడిందో తెలుసా?

Marsupial mole

చాలా అరుదైన జంతువు మార్సుపియల్ మోల్ (అడవి ఎలుక) తాజాగా ఆస్ట్రేలియాలో కనపడింది. ఈ జంతువులను కకర్రతుల్ అని కూడా అంటారు. ఇవి మనుషులకు చాలా అరుదుగా కనిపిస్తాయి. పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. ఇవి మన అరచేతిలోనూ పట్టేటంతగా ఉంటాయి.

Marsupial mole

Marsupial mole

వీటికి కళ్లు ఉండవు, శరీరంపై గోల్డ్ కలర్ వెంట్రుకలతో ఉంటాయి. చిన్నతోక, ముడుచుకుని ఉన్నట్లు కనపడే చేతులతో ఇవి కనపడుతుంటాయి. తాజాగా కనపడిన మోల్ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోను తీసిన చూపించిన తర్వాత కొందరు ఏప్రిల్ ఫూల్ చేయడానికి చూపిస్తున్నారని అనుకున్నారని ఎడారి వన్యప్రాణి నిష్ణాతుడు గారెత్ కాట్ మీడియాకు చెప్పారు.

ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల్లో ఇవి అరుదుగా కనపడుతుంటాయి. వాటి సంఖ్య ఎంత ఉందో కూడా అధికారులకు తెలియదు. మార్సుపియల్ మోల్స్ దాదాపు పదేళ్లకు ఓసారి మాత్రమే మనుషులకు కనపడుతుంటాయి. అంటే వాటిని గుర్తించడం అంత కష్టం.

వాటి ఉనికి చాలా మంది నిపుణులకు ఓ రహస్యంగా మిగిలిపోయిందని గారెత్ కాట్ చెప్పారు. తాజాగా ఆ మోల్ ను ఎవరో స్థానికులు చూశారని, మొదట దాన్ని గినియా పంది పిల్లగా భావించారని తెలిపారు. నిపుణులు దాన్ని చూశాక మార్సుపియల్ మోల్ గా నిర్ధారించారని చెప్పారు.

Also Read: ఎట్టకేలకు భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది.. బిగ్ హింట్ ఇచ్చిన ఎలన్ మస్క్.. రోబోటాక్సీ లాంచ్ డేట్ రివీల్ చేశాడుగా!