Makar Sankranti 2024: సంక్రాంతి స్పెషల్ వంటకాలు

తెలుగు పండుగల సమయంలో ఆంధ్ర గృహాల్లో గుజియా(కోవాపూరి) మరో ప్రసిద్ధ సంప్రదాయ వంటకం...అంతేకాదు రుచికరమైన, ఆరోగ్యవంతమైన స్వీట్ కూడా.

Makar Sankranti 2024: సంక్రాంతి స్పెషల్ వంటకాలు

sankranti

సంక్రాంతి పండుగ అంటే గాలిపటాలు, బంధుమిత్రుల కలయిక మాత్రమే కాదు.. నోరూరించే పిండి వంటలు కూడా. తెలుగు పండుగల సమయంలో ఆంధ్ర గృహాల్లో గుజియా(కోవాపూరి) మరో ప్రసిద్ధ సంప్రదాయ వంటకం…అంతేకాదు రుచికరమైన, ఆరోగ్యవంతమైన స్వీట్ కూడా.

గుజియా(కోవాపూరి):
తెలుగు పండుగల సమయంలో ఆంధ్ర గృహాల్లో గుజియా(కోవాపూరి)  మరో ప్రసిద్ధ సంప్రదాయ వంటకం…అంతేకాదు రుచికరమైన, ఆరోగ్యవంతమైన స్వీట్ కూడా.
కావలసిన పదార్దాలు:
మైదా అరకిలో, నెయ్యి పిండిలో కలిపేందుకు, 6 టేబుల్ స్పూన్లు, నెయ్యి లేదా నూనె వేయించడానికి సరిపడా.
లోపల నింపేందుకు: 
పచ్చికోవా అరకిలో, యాలకులపొడి అరటీస్పూను, 3 టేబుల్ స్పూన్లు బాదంపప్పు(సన్నగా తరగాలి), జీడిపప్పు 3 టేబుల్ స్పూన్లు (చిన్నముక్కలుగా చేయాలి), ఎండుకొబ్బరి తురుము 3  టేబుల్ స్పూన్లు, ఎండు ద్రాక్ష 5, పంచదార 350గ్రా.

తయారు చేసే విధానం:
పిండిలో నెయ్యి వేసి కలపాలి. తరవాత అందులో కొద్దిగా నీళ్లు పోసి పూరీ పిండిలా కలిపి తడిబట్ట కప్పి పక్కన ఉంచాలి. కాసేపటి తరవాత పంచదారపొడిలో యాలకులపొడి, పచ్చికోవా వేసి కలిపి బాదంపప్పు, జీడిపప్పు, ఎండుకొబ్బరి తురుము, ఎండు ద్రాక్ష కూడా వేసి కలపి రెండు నిమిషాలు వేయించి దించి చల్లార్చాలి.
మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తాలి. అందులో వేయించిన కోవా మిశ్రమాన్ని పెట్టి అంచులకు తడి రాసి కజ్జికాయల మాదిరి మడిచి మిశ్రమం బయటకు రాకుండా వేళ్లతోనే ఒత్తాలి లేదా కజ్జికాయలు చేసే చెక్కతో నొక్కినా వస్తాయి.  ఇలా అన్నీ చేసి పెట్టుకుని స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి లేదా నూనెతో నాలుగు చొప్పున ఎర్రగా వేయించి తీయాలి.

Makar Sankranti 2024: ఉభయ గోదావరి జిల్లాలో మొదలైన సంక్రాంతి ఫీవర్