Girlbaby Born After 138 Years : 138 ఏళ్ల తర్వాత ఆ వంశంలో పుట్టిన తొలి ఆడబిడ్డ, పట్టరాని సంతోషంతో సంబరాలు

138 సంవత్సరాలుగా చూసిన ఆ వంశం ఎదురు చూపులు ఫలించాయి. పండింటిఆడబిడ్డ జననంతో వారి కుటుంబంలో సంతోషాల లోకంగా మారిపోయింది. బంధువులంతా చిట్టితల్లిని చూడటానికి వచ్చి ముద్దులతో ముంచేస్తున్నారు.

Girlbaby Born After 138 Years : 138 ఏళ్ల తర్వాత ఆ వంశంలో పుట్టిన తొలి ఆడబిడ్డ, పట్టరాని సంతోషంతో సంబరాలు

Girlbaby Born After 138 Years

Updated On : April 7, 2023 / 10:49 AM IST

Girlbaby Born After 138 Years : అది అమెరికాలోని మిషిగాన్‌ రాష్ట్రంలో నివసించే ఓ కుటుంబం. వారికి ఓ ఆడపిల్ల పుట్టింది. అంతే వారి ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే వారి వంశంలో గతం 138 ఏళ్ల తరువాత తొలిసారి ఆడబిడ్డ పుట్టింది. 1885 సంవత్సరం తర్వాత అంటే 138 సంవత్సరాల తర్వాత వారి వంశంలో ఆడపిల్ల పుట్టడంతో వారు సంతోషంలో మునిగి తేలిపోతున్నారు. ఆడబిడ్డ పుట్టిందనే సంతోషాన్ని వారి బంధవులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

ఎక్కడెక్కినుంచి బంధువులు వచ్చి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. చిట్టితల్లిని ముద్దులతో ముంచేశారు. మిషిగాన్‌లోని కలడోనియాలో నివసిస్తోన్న ఆండ్రూ క్లార్క్‌- కరోలిన్ దంపతులకు మార్చి 17న ఆడబిడ్డ పుట్టింది. వారి వంశంలో 1885 తర్వాత పుట్టిన తొలి ఆడపిల్లను చూసి మురిసిపోతున్నారు. సంతోషాలు తెచ్చిన చిట్టితల్లిని ఎంతో అపురూపంగా గుండెల్లో పెట్టుకుని పెంచుతామంటున్నారు. వారి వంశంలో ఎవ్వరు గర్భవతులు అయినా ఆడపిల్ల పుడుతుందేమోనని ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. కానీ ఎవ్వరికి ఆడపిల్ల పుట్టలేదు. అందరికి మగబిడ్డలే పుట్టడంతో ఇక మన కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టదా? అనుకుని మధనపడేవారు.

ఆడపిల్ల కోసం తమ కుటుంబం 100ఏళ్లకు పైగా ఎదురు చూస్తున్నామని ఇప్పుడు నువ్వు గర్భవతివి అయ్యావు మనకు ఆడపిల్ల పుడితే ఎంత బాగుండు అనేవాడని కరోలిన్ తెలిపారు. కానీ భర్త మాటలు విన్న నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 100 ఏళ్లకుపైగా ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఆడపిల్ల పుట్టలేదా? అని ఆశ్చర్యం కలిగింది..అదే విషయాన్ని అత్తగారిని అడిగితే ఆమె అదే చెప్పారని..ఇతర కుటుంబ సభ్యులకు ఆడపిల్లలు ఉన్నారు కానీ, తమ వంశంలో పుట్టలేదంటూ ఆవేదన చెందేవారని తెలిపారు కరోలిన్. తను గర్భదాల్చిన తరువాత ఆడబిడ్డ పుడితే ఎంతబాగుండు అని అత్త, నా భర్త అనుకునేవారట..కానీ నేను గర్భం దాల్చిన తర్వాత ఎవరు పుడతారన్న విషయాన్ని తాను పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడు ఆడపిల్ల పుట్టడం చాలా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పుడు తొలిసారి పుట్టిన పాపకు ఆండ్రూ అని పేరు పెట్టామని తెలిపారు. కరోలిన్ కు ఇప్పటికే ఓ బాబు ఉన్నాడు. తరువాత 2021 జనవరిలో అబార్షన్ అయ్యింది. తరువాత ఆడపిల్ల పుట్టటం చాలా చాలా సంతోషంగా ఉందని తెలిపారు.