Looking For A Husband : భర్త కావాలి అంటూ బోర్డుతో రోడ్డుపై నిలబడ్డ సుందరాంగి .. నాకు భార్య కావాలంటూ వచ్చిన వ్యక్తి

భర్త కావాలి అంటూ బోర్డుతో రోడ్డుపై నిలబడింది ఓ సుందరి.. భర్త కావాలి అంటూ సిటీ అంతా బోర్డు పట్టుకుని తిరుగుతున్న ఆమెను చూసి నాకు భార్య కావాలంటే వచ్చాడో వ్యక్తి..ఇంకేముంది..

Woman Looking For A Husband Placard

woman Looking For A Husband bord : మొగుడు కావాలి అని ఏ అమ్మాయి అయినా అడిగితే ఏంటీ మరీ ఇంత బరితెగించేశావు అంటారు. కానీ ఓ అమ్మాయి ఏకంగా తనకు మొగుడు కావాలి అంటూ ఓ బోర్డు రాసి ఆ బోర్డు పట్టుకుని నడి రోడ్డుపై నిలబడింది. భర్త కావాలి అనే బోర్డుతో నడిరోడ్డుమీద నిల్చోటమేంటీ..ఈరోజుల్లో మాట్రిమోనీ సైట్లు బొచ్చెడు ఉన్నాయి..అలాడే డేటింగ్ యాప్ లు కోకొల్లుగా ఉన్నాయిగా అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ఈ సుందరాంగి స్టైలే వేరులా ఉంది. అందుకే తనకు భర్త కావాలి అంటూ బోర్డు పెట్టుకుని మరీ అడుగుతోంది.

అమెరికాలో రెండేళ్లుగా సింగిల్‌గా ఉంటున్న బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కరోలినా గీట్స్‌ తనకు ఓ భర్త కావాలి అంటూ వినూత్నంగా బోర్డుతో ప్రకటించింది. ఆమె అలా భర్త కావాలి అంటూ బోర్డుతో నిలబడిందో లేదో నాకూ భార్య కావాలి అంటూ వచ్చోడో సుందరాంగుడు. ఇంకేముంది..? నాకు భర్త కావాలి నీకు భార్య కావాలి ఇక మాట్లాడేసుకుందాం అంటూ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు.

Hong Kong : దక్షిణకొరియా మహిళపై లైంగిక వేధింపులు, హాంగ్‌కాంగ్‌లో భారతీయుడు అరెస్ట్

ఈ వినూత్న ప్రకటన గురించి సోహో పట్టణానికి చెందిన కోరిలినా మీడియాతో మాట్లాడుతూ తాను ‘భర్త కోసం వెదుకుతున్నాను’ అనే బోర్డుతో సిటీ అంతా తిరగాలనుకున్నానని తెలిపింది. అదేంటీ దీని కోసం చాలా యాప్ లు ఉన్నాయి కదాని మీడియా ప్రశ్నించగా ..టిండర్‌, హింజ్‌ లాంటి డేటింగ్‌ యాప్‌ల ద్వారా కొందరు పురుషులతో స్నేహం చేసానని..కానీ వాళ్లెవరు తనకు నచ్చలేదని దీంతో తనకు టైమ్ వేస్టు అయ్యిందని వాపోయింది. అందుకే ఇలా కొత్తగా ట్రై చేశానని తెలిపింది.

Sidharth Luthra : న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైనది : సిద్ధార్థ లూథ్రా సంచలన వ్యాఖ్యలు

భర్త కోసం వెదుకుతూ రోడ్డు మీదకు వచ్చిన 30 నిముషాలకు తనకు ఫలితం కనిపించిందని..ఇక ఇద్దరం ఒకరికొకరు తెలుసుకోవాల్సి ఉందని..ఇదో రకమైన కొత్త అనుభవంగా ఉందని ఎడ్మైరింగ్ గా చెప్పుకొచ్చింది. మరి ఈ పరిచయం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి అంటూ చెప్పుకొచ్చింది. ఇద్దరు ఒకరి ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. రుచులు, అభిరుచులు కలబోసుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఆమె వివాహం చేసుకుంటుందా..? లేదా మరో వినూత్న యత్నం చేస్తుందో మరి..