Rare And Strange fruits : పోషకాల మెండు .. ప్రపపంచలోనే విచిత్రమైన,ఆశ్చర్యపరిచే పండ్లు,వాటి విశేషాలు

మార్కెటింగ్ వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో భాగంగా సూపర్ మార్కెట్లు,మాల్స్ ల్లో ఎన్నో రకాల కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. ఒకప్పుడు నగరాల్లో కూడా లిచి, డ్రాగన్ ఫ్రూట్, బెర్రీ ఫ్రూట్స్, బ్లూ బెర్రీస్, రెడ్ చెర్రీస్ అందుబాటులో ఉండేవి కాదు కానీ ఇప్పుడలా కాదు చాలా రకాల దేశ విదేశీ పండ్లు, కూరగాయలు కూడా మాల్స్, సూపర్ మార్కెట్స్ లో అందుబాటుకొస్తున్నాయి. అయినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే వింత విచిత్రమైన పండ్ల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది..

Rare And Strange fruits : పోషకాల మెండు .. ప్రపపంచలోనే విచిత్రమైన,ఆశ్చర్యపరిచే పండ్లు,వాటి విశేషాలు

very rare fruits In world

Rare And Strange fruits In world : ద్రాక్ష, మామిడి, బత్తాయి, యాపిల్ అరటి,నారింజ, జామ వంటి పండ్లు మనకు తెలుసు.కానీ ఈ ప్రకృతిలో ఉండే ఎన్నో వింత పండ్లు ఉన్నాయి. వాటి పేరు కూడా చాలామంది విని ఉండరు.వాటి ఆకారం కూడా కూడా వింతగా..విచిత్రంగా ఉంటాయి. ఇక ఆ పండ్ల లోపల ఎలా ఉంటుంది.వాటి రుచి ఎలా ఉంటుంది..? అసలు అవి తింటారా? అనే ఎన్నో ఎన్నో సందేహాలు వచ్చేస్తాయి. మరెన్నో భయాలు కూడా కలుగుతాయి వాటి ఆకారం చూస్తే..నిజం చెప్పాలంటే ఏ పండును ఎలా తినాలో కూడా అర్థం కాకుండా ఉంటాయి వాటి ఆకారం చూస్తే.వాటిని డైరెక్టుగా తినాలా..? లేదా ఒలిచి తినాలా..పగుల గొట్టి తినాలా ఇలా ఎన్నో ఎన్నెన్నో డౌట్స్ వచ్చేస్తాయి. మరి అటువంటి కొన్ని విచిత్రమైన పండ్ల గురించి తెలుసుకుందాం..వాటి రుచి ఎలా ఉంటుంది..?అవి తింటే కలిగే ప్రయోజనాలేంటీ..?ఆ పండ్లు ఎక్కడెక్కడ లభిస్తాయి…ఇలా వాటి విశేషాల గురించి తెలుసుకుందాం..

ఒకప్పటి కంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెటింగ్ బాగా పెరిగింది. దీంతో ఆయా దేశాల్లో పండే పంటలు. పండ్లు, కూరగాయలు, పూలు వంటివి దేశ దేశాలకు అందుబాటులోకి వస్తున్నాయి. మార్కెటింగ్ వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో భాగంగా సూపర్ మార్కెట్లు,మాల్స్ ల్లో ఎన్నో రకాల కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. ఒకప్పుడు నగరాల్లో కూడా లిచి, డ్రాగన్ ఫ్రూట్, బెర్రీ ఫ్రూట్స్, బ్లూ బెర్రీస్, రెడ్ చెర్రీస్ అందుబాటులో ఉండేవి కాదు కానీ ఇప్పుడలా కాదు చాలా రకాల దేశ విదేశీ పండ్లు, కూరగాయలు కూడా మాల్స్, సూపర్ మార్కెట్స్ లో అందుబాటుకొస్తున్నాయి. అయినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే వింత విచిత్రమైన పండ్ల గురించి తెలిస్తే చాలా చాలా ఆశ్చర్యమేస్తుంది..

మంకీ ఫ్రూట్ (Monkey Fruit): ఇది మంకీ ఫ్రూట్. భారత్ తో పాటు మన సరిహధ్దు దేశమైన నేపాల్‌ లో కూడా పండుతాయి. అలాగే ఆగ్నేయాసియాలో కాస్తాయి. చూడ్డానికి గ్రీన్ బంగాళాదుంపల్లా ఉండే ఈ పండ్లు… ఆరోగ్యానికి చాలా మంచివి. ఔషధాల తయారీలో వాడతారు. ఈ చెట్టు కలపకు డిమాండ్ కూడా ఎక్కువే. థాయ్‌లాండ్‌లో దీనితో సంగీత పరికరాలు తయారుచేస్తారు. పుల్లగా ఉండే ఈ పండుతో… పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది మన దేశంలో లభిస్తున్నా… దీనికి అంతగా ప్రాచుర్యం లేదు. పుల్లగా ఉంటుందని ప్రజలు తినటానికి పెద్దగా ఇష్టపడకపోవటం దీనికి ప్రాచుర్యంలేకుండాపోయింది.

బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్ (Budha Hand Fruit): దీని పేరు బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్. తూర్పు ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి… బుద్ధుడి చెయ్యితో దీన్ని పోల్చారు. ఈ పండు రుచి చాలా చాలా పుల్లంగా ఉంటుంది. కండ ఎక్కువగా ఉంటుంది.గుజ్జుగానీ, రసంగానీ ఉండదు. అందుకే దీన్ని చాలా తక్కువమంది తింటారు. దీన్ని చూస్తే పండు అనలేం. విచిత్రమైన ఆకారం దీనిది. అందుకే దీన్ని విరబూసిన నిమ్మకాయ అంటారు. చైనా ప్రజలు దీన్ని లక్కీ ఫ్రూట్ అంటారు. జపాన్‌లో కొత్త సంవత్సరం సందర్భాల్లో బహుమతులుగా ఇచ్చకుంటారు ఈ పండును. ఈ పండు పుల్లగా ఉన్నా చక్కటి సువాసనతో ఉంటుంది. పరిమళాలు వెదజల్లుతుంది కాబట్టి దీన్ని డెకరేషన్స్ లోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎండగా ఉండే ప్రదేశాల్లో పండుతాయి.

గాక్ ఫ్రూట్ (Gac Fruit): ఈ ఫ్రూట్ గాక్ ఫ్రూట్. వియత్నాంలో దీన్ని న్యూఇయర్‌ గిఫ్టుగా ఇస్తారు. చైనా, ఆస్ట్రేలియాతోపాటూ… ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ పండులో సి విటమిన్ ఫుల్ గా ఉంటుంది. నారింజకంటే 40 రెట్లు ఎక్కువ C విటమిన్ ఉంటుంది ఈ పండులో. అంతేకాదు కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఈ ఫ్రూట్‌కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. డిసెంబర్, జనవరిలో కాస్తాయి.

రంబుటాన్ ప్రూట్ (Rambutan Fruit): రంబుటాన్ ప్రూట్. పైన ఎర్రగా లోపల వెన్నముద్దలాగా చూడటానికి భలే అందంగా ఉంటుంది. రంబుటాన్ అంటే జుట్టు అని అర్థం. ఈ పండుకు చుట్టూ జుట్టు లాంటి పీచు ఉంటుంది. అందుకే దీన్ని అలా పిలుస్తున్నారు. ఆగ్నేయాసియా, ఇండొనేసియా, మలేసియాలో ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ లో చాలా తక్కువగా ఉంటుంది. తియ్యగా రవ్వ రవ్వలాగా ఉన్నా కరకరలాడుతు ఉంటుంది. చూడగానే తినాలనిపించేలా నోరూరిస్తుంది. ఈ పండులో విటమిన్లు, పోషకాలూ చాలా ఎక్కువ. మాంగనీస్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది.

జబుటికాబా పండ్లు (Jabuticaba Fruit): జబుటికాబా పండ్లు చెట్టు కాండానికే కాసేసే ఈ పండ్లను జబుటికాబా పండ్లని పిలుస్తారు. జబుటి అంటే తాబేలు. కాబా అంటే… తిరిగే ప్రాంతం. తాబేళ్లు తిరిగే ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని అందుకే వీటికి ఆ పేరు పెట్టారు. సో ఈ పండ్లు దక్షిణ అమెరికా సొంతం. కానీ ఈ పండ్లు మాత్రం బ్రెజిల్‌ ద్రాక్ష (Brazil grapes)పేరుతోనే వరల్డ్ ఫేమస్ అయ్యాయి. సాధారణంగా కొమ్మల చివరలకు పూలు పూస్తాయి. ఈ చెట్లకు మాత్రం కొమ్మల నిండా పూలు పూస్తాయి. వాటి నుంచీ పండ్లు వస్తాయి. ద్రాక్ష లాగే… వీటినీ అలా నోట్లో పెట్టుకొని తినేయొచ్చు.రుచికి పుల్లగా, కొంచెం తియ్యగా ఉంటాయి. వీటితో జెల్లీస్, జ్యూస్‌, వైన్‌ తయారుచేస్తారు. ఎండ వాతావరణం ఉండే ప్రాంతాల్లో పెరిగే ఈ చెట్లు సంవత్సరానికి రెండుసార్లు కాస్తాయి.

అక్కీ ప్రూట్(Ackee Fruit) : అక్కీ ప్రూట్ ఈ పండు పగిలితే లోపల నల్లటి గింజలు కనిపిస్తు చూడటానికి భలే గమ్మత్తుగా ఉంటుంది. ఐ అక్కీ ఫ్రూట్ తీ అక్కీ యాపిల్ అని కూడా పిలుస్తారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పెరిగే ఈ చెట్లు ఎండ ఉండే ఏ ప్రదేశంలోనైనా పెరగగలవు. అక్కీ కాయలు ఎరుపు రంగులోకి రాగానే కోసేస్తారు. దీంట్లో పప్పు గట్టిగా ఉండదు మెత్తగా, క్రీమీగా, స్పాంజీలా ఉంటుంది. దీన్ని ఉడకబెట్టి తింటే భలే కమ్మగా ఉంటుంది.

డ్యురియన్ ఫ్రూట్ (Durian Fruit): డ్యురియన్ ఫ్రూట్. చూడ్డానికి మన పనసపండులా ఉంటుంది. భారీగానే ఉంటుంది పనసలాగా. థాయ్‌లాండ్, మలేసియాలో ఇది ఎక్కువగా కనిపించే ఈ పండు ముగ్గాక లోపల జ్యూస్ లాగా తయారవుతుంది. మనం మామిడిని పండ్లలో రారాజు అని ఎలా అంటామో అక్కడి ప్రజలు ఈ పండును స్థానికులు దీన్ని పండ్లలో రారాజు అంటారు. దాదాపు 3 కేజీల బరువు పెరగుతుందీ పండు. ఈ పండునుంచి ఐదు రకాల వాసనలు వస్తాయి. తీపి, ఆల్కహాల్, చేదు, సువాసన, కుళ్లిపోయిన ఉల్లిపాయల వాసనతో విచిత్రంగా ఉంటందిది. స్వీట్స్ లో ఈ పండుగుజ్జును వినియోగిస్తారు. కొంతమంది ఈ పండుగింజల్ని కూడా తింటారు. విచిత్రమైన వాసనలు ఉండటంతో ఈ పండును కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు. మరి ముఖ్యంగా కొన్ని ఎయిర్ పోర్టుల్లో.

మంగోస్టీన్ ఫ్రూట్(Mangosteen Fruit): మంగోస్టీన్ ఫ్రూట్ తియ్యటి రుచితో… సీతాఫలంలా నోరూరిస్తుంది. ఎర్రగా, పర్పుల్ కలర్‌లోకి మారిన పండు ఎక్కువ రుచిగా ఉంటుంది. తీపి, కమ్మటి వాసనతో… ఆకట్టుకుంటుంది. ఆగ్నేయాసియా, ఇండియా,ఎక్కువగా ఇండొనేసియాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇదో అరుదైన పండుగా ఉంది.చూడటానికి భలే ముద్దుగా ఉంటుంది.లోపల పత్తి కాయ విచ్చితే ఉన్నంత తెల్లగా ఉంటుంది.తియ్యటి రుచి ఉన్నా..చాలా చాలా క్యూట్ గా ఉండే ఈ పండుకు పెద్దగా ఆదరణలేకపోవటం దురదృష్టం.