Bigest Tip : రూ. 600లు బిల్‌కు రూ.6లక్షలు టిప్ ఇచ్చిన మహిళ .. తర్వాత తన డబ్బు ఇచ్చేయాలంటూ పోరాటం

ఓ మహిళా రెస్టారెంట్ కు వెళ్లి ఆహారం తిని భారీ టిప్ ఇచ్చింది. ఆ తరువాత లబోదిబోమంటూ తన టిప్ గా ఇచ్చిన డబ్బులు ఇచ్చేయాలంటూ పోరాటం చేసింది.

Women Bigest tip at Subway

Women Bigest tip at Subway : ఏదైనా హోటల్, రెస్టారెంట్లకు వెళి తిన్నాక సర్వర్లకు టిప్ ఇస్తుంటాం. కస్టమర్లు ఎక్కువ టిప్ ఇస్తే తెగ సంతోషపడిపోతారు సర్వర్లు. భారీగా టిప్ ఇచ్చిన కస్టమర్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఓ మహిళా కస్టమర్ రెస్టారెంట్ కు వెళ్లి ఓ శాండ్ విచ్ తో పాటు మరికొని తిని..తరువాత భారీగా టిప్ ఇచ్చింది. ఎంత అంటే అక్షరాలా ఆరు లక్షల రూపాయలు టిప్ ఇచ్చింది. ఆమె మొత్తం తిన్న ఆహారానికి రూ.628లు బిల్ అయ్యింది. కానీ ఆమె మాత్రం టిప్ గా రూ.6లక్షలు ఇచ్చింది. దీంతో అంత భారీ టిప్ అందుకున్న సర్వర్ తో పాటు రెస్టారెంట్ సిబ్బంది అంతా సంతోషపడిపోయారు.కానీ ఆతరువాత సదరు టిప్ ఇచ్చిన టిప్ కు షాక్ అయ్యారు..

అమెరికాలో వేరా కార్నర్ అనే ఓ మహిళ అక్టోబర్ 23న ఓ ఇటాలియన్ సబే వే రెస్టారెంట్ కు వెళ్లింది. ఓ శాండ్ విచ్,పెప్పరోనీ, ఫుల్ లాంగ్,సలామీ ఆర్డర్ ఇచ్చింది. సర్వర్లు కూడా తెచ్చి ఇచ్చాడు. తిన్న తరువాత వాటికి బిల్ 7.54 dollar బిల్ అయ్యింది. అంటే భారత కరెన్సీలో రూ.628 అయ్యింది. ఆమె బిల్ తో పాటు టిప్ 7 105 డాలర్ల టిప్ అంటే భారత కరెన్సీలో దాదాపు ((Rs 5,91,951))రూ.6లక్షలు టిప్ ఇచ్చిది.

63 ఏళ్ల వ్యక్తి పేగులో ఈగ .. షాక్ అయిన డాక్టర్లు

అంత భారీ టిప్ అందడంతో రెస్టారెంట్ సిబ్బంది ఆనందం అంతా ఇంతా కాదు. ఆమె చాలా గొప్పది అనుకుంటు పొగిడారు. కానీ తాను ఇచ్చిన టిప్ పొరపాటున ఇచ్చాననని లబోదిబోమంది. దీంతో రెస్టారెంట్ సిబ్బంది ఆనందం ఆవిరైపోయింది. అసలు పొరపాటు ఎలా జరిగిందంటే..వేరా కార్నర్ బిల్లు చెల్లించే పొరపాటు పడింది. 7.54 డాలర్లు కొట్టాల్సిన చోట పొరపాటున తన ఫోన్ నెంబర్ లోని చివరి ఆరు అంకెలు కొట్టింది. దీంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డుతో ఈ ట్రాన్సాక్షన్ తో టిప్ భారీగా కట్ అయ్యింది. వారం తరువాత క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ చూశాక అర్థమైంది. అసలు విషయం అర్థమై గాబరాపడిపోయింది. పొరపాటుగా ఆ అమౌంట్ కొట్టానంటూ వాపోయింది. తరువాత సదరు బ్యాంకుకు వెళ్లింది. తను చేసిన పొరపాటు బ్యాంక్ కు తెలిపింది. బ్యాంక్ మేనేజన్ వద్దకు వెళ్లి విషయం వివరించి తన సొమ్మును తిరిగి తన ఖాతాలో జమ చేయాలని కోరింది. కానీ బ్యాంకు వారు అది కుదరదు అన్నారు. విచారణ జరిపించి వేరా సొమ్ము తిరిగిప్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

Music frogs : సంగీతం పాడే కప్పలు .. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు

ఆమె సబ్ వే యాజమాన్యాన్ని సంప్రదించింది. జరిగిన విషయాన్ని వివరిచింది. దయచేసి తన డబ్బు తనకు వచ్చేలా చేయమని కోరింది. అలాగే బ్యాంకు విచారణలో భాగంగా సబ్ వేని సంప్రదించారు. విషయం గురించి ఆరా తీశారు. దానికి సబ్ వే మేనేజ్ మెంట్ కూడా సానుకూలంగా స్పందించింది.. నిజమేనని చెప్పింది. అలా సబ్ వే యాజమాన్యం పొరపాటున చెల్లించిన టిప్ డబ్బును తిరిగి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈప్రక్రియ అంతా ముగిసాక ఆమె డబ్బు ఒక నెల తరువాత డబ్బు క్రెడిట్ చేయబడింది.దీంతో హాయిగా ఊపిరి పీల్చుకుంది.

ట్రెండింగ్ వార్తలు