Fly in Man Intestines : 63 ఏళ్ల వ్యక్తి పేగులో ఈగ .. షాక్ అయిన డాక్టర్లు

63 ఏళ్ల వద్ధుడు పెద్దపేగులో ఓ ఈగ ఉండటం చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు. పెద్దపేగులోకి ఈగ ఎలా వెళ్లింది..? అని ఆశ్చర్యపోయారు.

Fly in Man Intestines : 63 ఏళ్ల వ్యక్తి పేగులో ఈగ .. షాక్ అయిన డాక్టర్లు

Fly in US man intestines

Fly in US man intestines : అతనో 63 ఏళ్ల వద్ధుడు. చెకప్ చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాడు. కొలొనోస్కోపీ కోసం వెళ్లిన వృద్ధుడికి పరీక్షలు చేసిన డాక్టర్లు షాక్ అయ్యారు. ఎందుకంటే అతని పెద్దపేగులో ఓ ఈగ కనిపించింది. పేగుల్లోకి ఈగ ఎలా వెళ్లిందా..? అని ఆశ్చర్యపోయారు. కొలొనోస్కోపీ అనేది కొలొరెక్టల్ వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, నివారించడానికి ఉపయోగించే విధానం.  కొలొనోస్కోపీ ప్రక్రియలో ఓ ప్లెక్సిబుల్ ట్యూబ్‌కు చిన్న కెమెరా, లైట్ అమర్చి పెద్దపేగులోకి పంపించి పరీక్షిస్తారు. ఈ పరీక్ష చేయించుకునేందుకు వెళ్లిన వద్ధుడి పెద్ద పేగులో ఈగ ఉండటం..అది కూడా  ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటం చూసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అదే విషయాన్ని సదరు వ్యక్తికి చెప్పగా అతను కూడా షాక్ అయ్యాడు.

అమెరికాలోని మిస్సౌరీలో జరిగిందీ ఘటనలో కొలొనోస్కోపీ చేయించుకోటానికి ముందు ఎటువంటి ఆహారం తిన్నాడు..? తిని ఎంత సేపు అయ్యింది..? అనే విషయాలను ఆరా తీశారు. దానికి అతను పిజ్జా, పాలకూర, లిక్విడ్ తాగానని తెలిపాడు. దీంతో ఓ ఈగ పెద్దపేగులోకి ఎలా వెళ్లిందా..? అని మిస్సౌరీ విశ్వవిద్యాలయ గ్యాస్ట్రో ఎంటరాలిజిస్ట్ విభాగం నిపుణులు తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టారు. అదో మిస్టరీగా అనిపించింది వారికి.

Pregnancy After 40 : 40 ఏళ్ల తర్వాత గర్భందాల్చటం సురక్షితమా ? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

దీనిపై వర్శిటీ గ్యాస్ట్రో ఎంటరాలిజిస్ట్ చీఫ్ మాథ్యూ బెచ్‌టోల్డ్ రెండు అనుమానాలను వ్యక్తంచేశారు. ఒకటి..ఈ ఈగ సదరు వ్యక్తి అతనికి తెలియకుండానే నోటిలో నుంచి లోపలికి వెళ్లి..పెద్ద పేగులోకి వెళ్లి ఉండాలి. రెండోది..పురీషనాళం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చు. కానీ పెద్దపేగులోకి ఈగ వెళ్లటం అనేది దాదాపు అసాధ్యం అని..ఈగ అంత దూరంపాటు వెళ్లటం అసాద్యమనే అనుమానాలు కూడా వ్యక్తంచేశారు. పేగులో ఈగ ఉండే యాంగిల్ ను బట్టి అంటే ఏమాత్రం చెక్కు చెదకుండా ఉంటటాన్ని బట్టి అదికూడా అయి ఉండకపోవచ్చనే అనుమానాలు వెలువరించారు. ఎందుకంటే ఈగ అంతదూరం ప్రయాణించాలంటే అది పొడవుగా తెరుచుకుని ఉండాలి. కానీ, పెద్దపేగు మధ్యలో ముడుచుకుని వంకరగా ఉంటుంది. కాబట్టి అదికూడా తప్పే అని భావించారు. ఈగ చనిపోయినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటం డాక్టర్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

మధుమేహాంతో పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి సమస్యలు.. నివారణా మార్గాలు !

దీనికి సంబంధించిన విషయాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ జర్నల్ లో రాసుకొస్తు..ఇటువంటి అనుమానాలను వ్యక్తం చేశారు. జీర్ణవ్యవస్థలో కీటకాలు చెక్కుచెదరకుండా ఉండి గుడ్లు లేదంటే లార్వాలను జీర్ణాశయాంతర పేగులలో ఉంచి పేగు మయాసిస్‌కు కారణమయ్యే సందర్భాలు గతంలోనూ అరుదుగా ఉన్నాయని పేర్కొంది.

ఈగలు, వాటి లార్వాలు, పరాన్నజీవులు పేగులను ప్రభావితం చేసిన సందర్భాలు గతంలో జరిగినప్పటికీ ..పేగుల్లో జీర్ణం కాని ఈగను గుర్తించడం ఇదే తొలిసారి కావటం విశేషం. ఈగ లోపలికి వెళ్లినా..జీర్ణం కాకుండా యధావిధిగా ఎలా ఉంది..? అదెలా సాధ్యం..? అనేది మాత్రం అంతుచిక్కలేదు.