Music frogs : సంగీతం పాడే కప్పలు .. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు

కప్పలు బెకబెక మని అరుస్తాయి. కానీ సంగీతం పాడే కప్పల్ని ఎప్పుడైనా చూశారా..? ఇది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే సంగీతం పాడ కప్పల్ని కనుగొన్నారు.

Music frogs : సంగీతం పాడే కప్పలు .. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు

music frogs

Music frogs in Arunachal Pradesh : పిచ్చుకలు కిచ కిచ మని చిరు శబ్దాలతో అరుస్తాయి. కాకులు కావు కావు అని అరుస్తాయి. మరి కప్పలు ఏమంటాయి..? అంటూ అదేం పిచ్చి ప్రశ్న..?బెక బెకమంటాయి అని చిన్నపిల్లల్ని అడిగినా చెప్పేస్తారు. కానీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీతీరంలో కొన్ని కప్పలు ‘సంగీతం’ పాడుతున్నాయట. ఈ సరికొత్త రకం కప్పల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సంగీతం అంటే ఏదో నిజంగా సంగీతం కాకపోయినా కొత్తగా కనుగొన్న ఈ  కప్పలు ఓ ప్రత్యేకమైన శబ్దాలు చేస్తున్నాయట.ఆ శబ్దాలు వినటానికి సంగీతంలా ఉంటోందట..అందుకే ఈ కొత్త జాతి కప్పలకు శాస్త్రవేత్తలు ‘మ్యూజిక్‌ ఫ్రాగ్‌’ అని పేరు పెట్టారు.

బిటుపన్‌ బోరువా, వి.దీపక్‌, అభిజిత్‌ దాస్‌ అనే శాస్త్రవేత్తలు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీతీరంలో స్థానికంగా దిహాంగ్‌ అనే ప్రాంతంలో ఈ ‘మ్యూజిక్‌ ఫ్రాగ్‌’ అనే కొత్తజాతి కప్పలను కనుగొన్నారు. వీటిలో ఆడ, మగ కప్పలు రెండు కూడా ఓ రకమైన వింత శబ్దాలు చేయటం విన్న వారు ఆశ్చర్యపోరారు. బ్రహ్మపుత్ర నదీతీరంలో మొదటిసారిగా ఈ రకమైన వింత చప్పుళ్లు విన్నామని..ఇటువంటి శబ్దాలను తాము ఎప్పుడు వినలేదని సైన్స్‌ పత్రిక జూటాక్సాలో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇదేం ఫుడ్ అలర్జీ బాబోయ్.. ఈ 37 రకాల ఫుడ్ తింటే ఆమెకు..

2022 ఆగస్టు,సెప్టెంబర్ మధ్య ఈశాన్య రాష్ట్రంలోని చాంగ్లాంగ్,లోహిత్ జిల్లాలలో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించారు.ఈక్రమంలో నిస్సారమైన నీటి కొలనులలో ‘బలమైన’ శరీరాలతో బిగ్గరగా అరుస్తున్న మగ కప్పలను కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని చిత్తడి నేలలు,చెరువుల సమీపాల్లోను, రహదారి వైపు వింత శబ్దాలు వినిపించాయని పేర్కొన్నారు. ఈ కొత్తజాతి కప్పలు రెండు మూడు రకాల చప్పుళ్లతో ప్రత్యేకమైన శబ్దాలు చేస్తున్నాయని వెల్లడించారు.

అరుణాచల్‌ రాష్ట్రంలో 2022లో తాము నిర్వహించిన సర్వేల్లో కొత్తజాతి కప్పలను కనుగొన్నామని వెల్లడించారు. మగకప్పలు సుమారు 1.8 అంగుళాల నుంచి 2.3 అంగుళాల పొడవు ఉన్నాయని ఆడకప్పలు 2.4 అంగుళాల నుంచి 2.6 అంగుళాల పొడువు ఉన్నాయని తెలిపారు. ఈ కప్పలకు దేహం మధ్యలో లేత క్రీం రంగులో గీత ఉందని తెలిపారు. వీటి శరీరం చాలా మృదువుగా ముదురు గోధుమరంగులో ఉందని తెలిపారు.