Joanne Fan : ఇదేం ఫుడ్ అలర్జీ బాబోయ్.. ఈ 37 రకాల ఫుడ్ తింటే ఆమెకు..

కొందరిలో ఫుడ్ అలర్జీ ఉంటుంది. పడని ఆహారం తింటే చాలా ఇబ్బందులు పడతారు. అలాంటిది 37 కంటే ఎక్కువ ఫుడ్ అలర్జీలు ఉంటే.. ఓ యువతి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Joanne Fan : ఇదేం ఫుడ్ అలర్జీ బాబోయ్.. ఈ 37 రకాల ఫుడ్ తింటే ఆమెకు..

Joanne Fan

Joanne Fan : కొంతమందిలో కొన్ని ఆహార పదార్ధాలు తినడం వల్ల అలర్జీ వస్తుంది. పడని ఆహారం తినడం కారణంగా దురద, దద్దుర్లు, వాపు వంటివి మొదలవుతాయి. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా అవుతాయి. జోవాన్ ఫ్యాన్ అనే కంటెంట్ క్రియేటర్ ఫేస్ చేస్తున్న ఫుడ్ అలర్జీ గురించి వింటే అయ్య బాబోయ్ అంటాం. ఇటీవల తను ఎదుర్కుంటున్న ఇబ్బందిని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘చనిపోవడానికి 37 కొత్త మార్గాలు’ అంటూ ఆమె చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

Feeling Hungry : జంక్ ఫుడ్ , చక్కెర ఆహారాలు తినాలన్న కోరికలు తగ్గించుకోవాలనుకుంటే ?

ఫుడ్ అలర్జీ అనేది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 8%.. పెద్దలలో 4% ప్రభావితం చేస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఫుడ్ అలర్జీ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కొందరిలో ఫుడ్ అలర్జీ ప్రాణాంతకం కూడా. నోటిలో దురద, దద్దుర్లు, పెదవులు, ముఖం, నాలుక, గొంతు ఇతర భాగాలు వాయడం జరుగుతుంది. కడుపునొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం, మూర్చపోవడం కూడా జరగొచ్చు. ఏదో ఒకటో, రెండో ఆహార పదార్ధాలు పడకపోతే అలర్జీని ఫేస్ చేసేవారు ఉంటారు. కంటెంట్ క్రియేటర్ ఉన్న 21 ఏళ్ల జోవాన్ ఫ్యాన్ అనే యువతి మాత్రం మామూలు ఫుడ్ అలర్జీని ఫేస్ చేయడం లేదు.

Preventing Infections : హాస్పటల్ చుట్టూ తిరగకుండా ఉండాలంటే.. ఏంచేయాలో తెలుసా ?

సియోల్ కి చెందిన జోవాన్ ఫ్యాన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో, టిక్ టాక్‌లో ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఇటీవల ఆమె తను ఎదుర్కుంటున్న 37 రకాల ఫుడ్ ఎలర్జీల గురించి సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆమెకు అన్నిరకాల గింజలు, సీఫుడ్‌లతో అలర్జీ ఉందట. తను కేవలం 37 అలర్జీల గురించి మాత్రమే చెబుతున్నానని.. వాస్తవానికి అంతకంటే ఎక్కువ ఇబ్బందిని ఫేస్ చేస్తున్నట్లు ఆమె చెప్పింది. జోవాన్ ఫ్యాన్‌ను ఇటీవల ఆసుపత్రిలో డాక్టర్ ప్యాచ్ టెస్ట్‌తో పరీక్షలు చేసింది. అనేక కొత్త రకాల అలర్జీలను కనుగొన్నట్లు డాక్టర్ వెల్లడించిందట. ద్రాక్షపండ్లు వంటివి కూడా ఆమెకు అలర్జీ కలిగిస్తాయని జోవాన్ ఫ్యాన్ అనుకోలేదట. తన అలర్జీ టెస్ట్‌కు సంబంధించిన పోస్టుతో ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్‌లలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సంపాదించింది. ఈ సంవత్సరం ఎక్కువభాగం అలర్జీతో బాధపడినట్లు ఇది తన ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపినట్లు జోవాన్ ఫ్యాన్ తన పోస్టుల్లో రాసుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by justjoanne fan 安安 (@joanneffan)