Apple iPhone 17 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ 17 అతి తక్కువ ధరకే.. ఫ్లిప్కార్ట్లో జస్ట్ ఎంతంటే?
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ రూ. 9వేలు తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఈ ఐఫోన్ మోడల్ మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో చూద్దాం..

Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ అంటే అందరికి ఇష్టమే. అత్యంత ఖరీదైన ఐఫోన్ తక్కువ ధరలో వస్తుందంటే ఎవరూ వదులుకోరు. మీరు కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే ప్రస్తుతం భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 అతి చౌకైన ధరకే లభిస్తోంది.

ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ. 82,900 ఉండగా ఇప్పుడు ఈ-కామర్స్ ఫ్లిప్కార్ట్లో రూ. 9వేలు తగ్గింపుతో లభిస్తుంది. ఐఫోన్ 17 మోడల్ 6.3 అంగుళాల డిస్ ప్లే, ఆపిల్ ఏ19 చిప్ సెట్, 48ఎంపీ ఫ్యూజన్ మెయిన్ కెమెరా వంటి ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఐఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్లు లిమిటెడ్ టైమ్ మాత్రమే.. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆఫర్ ముగిసేలోపు కొనేసుకోవడం బెటర్.

ఆపిల్ ఐఫోన్ 17 డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900కు లాంచ్ అయింది. అయితే, ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.77,900 నేరుగా రూ. 5వేలు తగ్గింపుతో లభిస్తోంది. అదే బ్యాంకు ఆఫర్ బరోడా క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే రూ. 4వేలు వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా తగ్గింపు పొందాలంటే మీ పాత ఫోన్ తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 17 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 17 అనేది 6.3 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, ఆల్వేజ్ ఆన్ డిస్ ప్లే ఫీచర్లతో వస్తుంది. 3,000 నిట్స్ వరకు డిస్ ప్లే బ్రైట్ నెస్ అందిస్తుంది. హుడ్ కింద ఆపిల్ ఎ19 చిప్ సెట్, 8జీబీ ర్యామ్ అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 17లో 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా, 48MP ఫ్యూజన్ అల్ట్రా వైడ్ మైక్రో సపోర్టుతో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 18ఎంపీ కెమెరా ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఐఫోన్ 16తో పోలిస్తే బ్యాటరీ లైఫ్ 6 గంటల వరకు వస్తుంది.

ఈ ఐఫోన్ కొనాలా? వద్దా? :
ఐఫోన్ 18 సిరీస్ వచ్చే సెప్టెంబర్ 2026లో లాంచ్ కానుంది. గత ఏడాదిలో వచ్చిన ఐఫోన్ 17 ఇప్పుడు తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంతకన్నా ఇంకా తక్కువకు ఐఫోన్ కావాలంటే ఏదైనా సేల్ వరకు వెయిట్ చేయడమే బెటర్..
