Gold Silver Price Today : హర్మూజ్ ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా..
Gold Silver Price Today : బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. గురువారం కూడా వీటి ధరలు పెరిగాయి.

బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. ఇవాళ ధరలు భారీగా పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగాయి. హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరవడానికి జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపించడంతో, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు తగ్గాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. దీంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది.

బుధవారం భారీగా 4.1 శాతం ఎగిసిన బంగారం ధరలు గురువారం మరో 0.8 శాతం వరకు పెరిగి ఔన్సుకు సుమారు 4,280 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. ఇది గత ఆరు నెలల్లో నమోదైన అతిపెద్ద ర్యాలీ తర్వాత కొనసాగుతున్న లాభదాయక ధోరణిగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.289 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.265 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు బంగారంపై 15డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,270 డాలర్లు వద్ద కొనసాగుతోంది. వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 10వేలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,49,730 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,37,250 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,860 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,400 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,730కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,37,250 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,40,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
