Gold Silver Rates Today : భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. కారణాలివే.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
Gold Silver Rates Today : అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది.

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పసిడి మీద పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే సందేహంలో పెట్టుబడిదారులు మునిగిపోయారు. ధరలు ఈ మధ్య కాలంలో కుప్పకూలడంతో పసిడి భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుందోనని టెన్షన్ లో పెట్టుబడి దారులు ఉన్నారు.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 తగ్గింది. అయితే, సోమ, మంగళవారాల్లో కలిపి 24క్యారెట్ల బంగారంపై సుమారు రూ.1450 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. అక్కడ ఔన్సు గోల్డ్ 4,023 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,42,800 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,30,900 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,950 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,050 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,460కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,500 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,35,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
