Gold Silver Price Today : జులై నెల ప్రారంభం.. బంగారం ధరల్లో భారీ మార్పులు.. కారణాలివే.. ఏపీ, తెలంగాణలో గోల్డ్ రేటు ఇలా..
Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో నేడు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి అదిరిపోయే శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది.

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1260 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1150 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 34 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ పై 3,974 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,40,780 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,29,050 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,40,930 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,29,200 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,40,780కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,29,050 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,40,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,900 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
