Gold Silver Price Today : బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
Gold Silver Price Today : బంగారం ధరలో నేడు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు ఇవాళ భారీగా పెరిగింది.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.600 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 550 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ ధర 4,052 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,930 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,850 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,45,080 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,33,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,35,090కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,33,000 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
