Siddharth Galla Pasupu Function : ఘట్టమనేని ఇంట్లో మొదలైన పెళ్లి సందడి.. పసుపు ఫంక్షన్ ఫొటోలు.. మహేష్ బాబు మిస్సింగ్..
ఘట్టమనేని ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. మహేష్ బాబు మేనల్లుడు, మహేష్ పెద్ద అక్క పద్మావతి, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ల రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా నిశ్చితార్థం ఇటీవల తను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో జరిగింది. ఇప్పటికే పలు ఫొటోలు బయటకు రాగా తాజాగా మహేష్ సోదరి మంజుల అదే రోజు చేసిన పసుపు కొట్టే వేడుక ఫోటోలను బయటపెట్టింది. ఈ ఫొటోల్లో మహేష్ ముగ్గురు సోదరీమణులు, వారి పిల్లలు, ఫ్యామిలీలు ఉన్నారు. త్వరలోనే మహేష్ మేనల్లుడి పెళ్లి జరగనుంది. అయితే ఈ వేడుకలో మహేష్ బాబు మిస్సింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ రాజమౌళి వారణాసి షూటింగ్ లో ఉండటంతో ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తుంది.

















