నిఖిల్ స్వామి రారా సినిమాతో తెలుగు వారికీ పరిచయమైన నటి 'పూజ రామచంద్రన్'. ఈ భామ.. విలన్ పాత్రలు పోషించే 'జాన్ కొక్కెన్'ను 2019లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా పూజ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుక ఫోటోలను పూజ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.