రోహిత్ శర్మ వీరోచిత సెంచరీ.. వైరల్ అవుతున్న హిట్‌మ్యాన్ ఫోటోలు..
టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఎడాపెడా బౌండరీలు బాదుతూ తనదైన శైలిలో రెచ్చిపోయి 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేయడంతో కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ పై టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. అనంతరం భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిగతా బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (60), శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41) రాణించి టీమిండియాను గెలిపించారు.ఈ గెలుపుతో 2-0 తేడాతో ఇంకోమ్యాచ్ ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత్. చాలా రోజుల నుండి ఫామ్ లో లేక, అనేక విమర్శలు ఎదుర్కొన్న హిట్ మ్యాన్.. ఈ రోజు బ్యాటింగ్‌లో చెలరేగి, సెంచరీతో మెరిసిన రోహిత్ శర్మ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.











