Royal Enfield : కొత్త బుల్లెట్ బైక్ కావాలా? రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల ధరలు తగ్గాయోచ్.. ఏ వేరియంట్ ధరలు ఎంత తగ్గాయంటే?

Royal Enfield : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను మార్చినప్పటి నుంచి బైకులు, కార్ల ధరలలో భారీ తగ్గింపు కనిపించింది. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

1/9
Royal Enfield : మీ డ్రీమ్ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ అయితే మీకో గుడ్ న్యూస్.. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుల ధరలు భారీగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను మార్చినప్పటి నుంచి ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్ వాహనాల ధరలు దిగొచ్చాయి.
2/9
ఇప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా మోటార్ సైకిళ్ల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బేస్ మోడల్ ధర ప్రస్తుతం రూ. 1,97,253 ఎక్స్-షోరూమ్, తగ్గింపు తర్వాత ధర దాదాపు రూ. 1,77,253 ఉంటుంది. టాప్-ఎండ్ క్లాసిక్ 350 ధర రూ. 2,34,972, తగ్గింపు తర్వాత ధర దాదాపు రూ. 2,14,972 ఉంటుంది.
3/9
రాయల్ ఎన్ ఫీల్డ్ తయారీదారు ఏయే సెగ్మెంట్ బైక్‌ల ధరలను ఎంత తగ్గించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/9
బైకుల ధరలు ఎంత తగ్గాయంటే? : రాయల్ ఎన్ఫీల్డ్ 350సీసీ మోటార్ సైకిళ్లన్నింటి ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బెటాలియన్ బ్లాక్ బుల్లెట్ 350 బేస్ ట్రిమ్ ధర ప్రస్తుతం రూ. 1,76,625 ఉండగా తగ్గింపు తర్వాత ధర దాదాపు రూ. 1,56,625 అవుతుంది. టాప్-ఎండ్ బుల్లెట్ 350, ఇప్పుడు రూ. 2,20,466. జీఎస్టీ తగ్గింపు తర్వాత టాప్-ఎండ్ బుల్లెట్ ధర దాదాపు రూ. 2,00,466 అవుతుంది.
5/9
ఈ బైకుల ధరలు రూ.22 వేల వరకు తగ్గుతాయి. తద్వారా కస్టమర్లు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అతి చౌకైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చ. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బేస్ మోడల్ ధర రూ. 1,49,900. పూర్తిగా రూ. 22,000 తగ్గింపు ఇస్తే.. ధర రూ. 1,27,900 అవుతుంది. టాప్-ఎండ్ హంటర్ 350 ధర రూ. 1,81,750, తగ్గింపు తర్వాత ధర రూ. 1,59,750 కావచ్చు.
6/9
ఏ బైక్‌ల ధరలు తగ్గాయంటే? : అందిన సమాచారం ప్రకారం.. రాయల్ ఎన్ఫీల్డ్ 350cc విభాగంలో హంటర్ 350, గోవాన్ క్లాసిక్ 350, క్లాసిక్ 350, బుల్లెట్ 350, మీటియోర్ 350 బైకులను అందిస్తోంది. ఈ వేరియంట్‌ల ధరలు భారీగా తగ్గనున్నాయి.
7/9
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త GST సంస్కరణలతో 350cc లోపు మోటార్ సైకిళ్లను చౌకైన ధరకే పొందవచ్చు. మొదటిసారి కొనుగోలు చేసేవారికి కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి. గోవిందరాజన్ అన్నారు.
8/9
ధరల సవరణ ఫుల్ జీఎస్టీ ప్రయోజనాన్ని వినియోగదారులకు నేరుగా అందజేస్తున్నామని ఆయన చెప్పారు.
9/9
ఇప్పుడు తక్కువ ధరలతో మరింత మందికి రైడింగ్‌ ఆహ్లాదకరంగా మారుస్తుంది. రైడర్లకు అత్యుత్తమ మోటార్‌సైక్లింగ్ అనుభవాన్ని అందించడమే తమ ప్రయత్నమని గోవిందరాజన్ అన్నారు.