Shanmukh Jaswanth Wedding : పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. ఫోటోలు వైరల్..
Shanmukh Jaswanth wedding : బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పెళ్లి చేసుకున్నాడు.

బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఓ ఇంటి వాడు అయ్యాడు. తన ప్రియురాలు వైష్ణవి చోడిశెట్టి మెడలో మూడు ముళ్లు వేశాడు.

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవి చోడిశెట్టి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వైజాగ్‌కి చెందిన షణ్ముఖ్ జస్మంత్ యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. వైవా షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తరువాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు.

ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తరువాత అప్పటికే ప్రేమలో ఉన్న యూట్యూబర్ దీప్తి సునైనాతో విడిపోయాడు.

ఆ తరువాత కొన్నాళ్లకు రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టితో ప్రేమలో పడ్డాడు.

ఈ ఏడాది ఫిబ్రవరితో వీరు నిశ్చితార్థం చేసుకోగా తాజాగా పెళ్లి చేసుకున్నారు.
