Post Office Savings Schemes : పోస్టాఫీసులో టాప్ 5 సేవింగ్స్ స్కీమ్స్ మీకోసం.. మహిళలకు 2 స్పెషల్ స్కీమ్స్.. బిగ్ బెనిఫిట్స్ ఇవే..

Post Office Savings Schemes : పోస్టాఫీసు అందించే అద్భుతమైన పథకాల్లో టాప్ 5 స్కీమ్స్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? మహిళల కోసం ఆ రెండు పథకాలు ఇవే..

1/7
Post Office Savings Schemes : పోస్టాఫీసులో ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెడదామని అనుకుంటున్నారా? ప్రస్తుత రోజుల్లో చాలామంది తమ ఆదాయంలో కొంత డబ్బును ఆదా చేసి ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. మీరు కూడా పోస్టాఫీసు అందించే స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే ఇది మీకోసమే.. పోస్టాఫీసులో పెట్టుబడితో మంచి రాబడిని పొందవచ్చు. ప్రస్తుతం పోస్టాఫీసులో స్మాల్ సేవింగ్స్ పథకాలు బాగా పాపులర్ అయ్యాయి.
2/7
ఈ పథకాలు ఏడాదికి 7.5శాతం నుంచి 8.2శాతం వరకు రాబడిని అందిస్తాయి. అన్ని వయస్సుల వారికి పోస్టాఫీసులో పథకాలు ఉన్నాయి. చిన్న మొత్తంలో పెట్టుబడితో భవిష్యత్తులో భారీ మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవచ్చు. పోస్టాఫీసు అందించే అద్భుతమైన పథకాల్లో రెండు పథకాలు మహిళల కోసం అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసు టాప్ 5 సేవింగ్స్ స్కీమ్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
1వ స్కీమ్ : సుకన్య సమృద్ధి యోజన (SSY) : పోస్టాఫీసులో ఈ పథకం ఆడపిల్లల కోసం అందుబాటులో ఉంది. బాలికకు 10 ఏళ్లు నిండకముందే తల్లిదండ్రులు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 8.2శాతం వడ్డీని ఇస్తుంది. తల్లిదండ్రులు ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 80C కింద పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. తల్లిదండ్రులు ప్రతి ఏడాదిలో రూ.1.5 లక్షలు 15 ఏళ్ల పాటు పెడితే మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 69,27,578 పొందవచ్చు. ఇందులో రూ. 22,50,000 డిపాజిట్, రూ.46,77,578 కేవలం వడ్డీనే పొందవచ్చు. ఈ పథకం 2015లో ప్రారంభమైంది. 2024 నాటికి, 4.1 కోట్లకు పైగా అకౌంట్లు ఓపెన్ అయ్యాయి.
4/7
2వ స్కీమ్ : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) : పీపీఎఫ్ (PPF) స్కీమ్ చాలా సేఫ్.. అలాగే లాంగ్ టైమ్ ప్లాన్ కూడా. ఏడాదికి 7.1శాతం వడ్డీని పొందవచ్చు. 80C కింద పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. లాక్-ఇన్ టైమ్ 15 సంవత్సరాలు. మీరు కేవలం రూ. 500తో ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా డిపాజిట్ ఏడాదికి రూ. 1.5 లక్షలు. 15 ఏళ్ల తరువాత మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. చివరిగా మీకు లభించే డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు.
5/7
3వ స్కీమ్ : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) : ఈ స్కీమ్ 5 ఏళ్ల కాలానికి వర్తిస్తుంది. ఏడాదికి 7.7శాతం వడ్డీని ఇస్తుంది. ప్రతి ఏడాది వడ్డీ పెరుగుతుంది. కానీ, చివరికి మీకు డబ్బు వస్తుంది. మీరు ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం కూడా పొందవచ్చు. మీరు ఏదైనా పోస్టాఫీసు నుంచి సింగిల్ లేదా జాయింట్‌గా ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టొచ్చు.
6/7
4వ స్కీమ్ : పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS) : ఈ పథకం నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. వడ్డీ రేటు ఏడాదికి 7.4శాతంగా ఉంటుంది. మీరు రూ. 1,000తో ప్రారంభించవచ్చు. సింగిల్ అకౌంట్‌లో రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్‌లో రూ. 15 లక్షలు పెట్టవచ్చు. రూ.9 లక్షలు పెడితే నెలకు రూ. 5,550 వస్తుంది. రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ. 9,250 వడ్డీ వస్తుంది.
7/7
5వ స్కీమ్ : మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిపికేట్ (MSSC) : ఈ పథకం మహిళలకు మాత్రమే. 2 ఏళ్ల పాటు 7.5శాతం వడ్డీని మాత్రమే అందిస్తుంది. ఇందులో రూ. 1,000 నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. తల్లిదండ్రులు ఆడపిల్ల కోసం కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 2 అకౌంట్లు ఉంటే మొత్తం డబ్బు రూ. 2 లక్షలకు మించకూడదు. మీరు ఒక ఏడాది తర్వాత 40శాతం డబ్బు తీసుకోవచ్చు. మీరు 6 నెలల తర్వాత క్లోజ్ చేయొచ్చు కానీ 2శాతం వడ్డీ తగ్గుతుంది.