నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ పంచెకట్టుతో రాజసం ఉట్టిపడే లుక్ లో దర్శనమిచ్చాడు. ఇక ఈ సభావేదికపై నందమూరి అభిమానులు తమ అభిమాన హీరోకి గజ మాలలతో, వెండి విగ్రహాలతో సన్మానం చేశారు.