Rajasthan: సచిన్ పైలట్ మీద మరోసారి క్రమ శిక్షణ చర్యలు తీసుకోనున్న కాంగ్రెస్!

గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఆయన తన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అంతే కాదు, తనతో తిరుగుబాటుకు సహకరించిన వారు కూడా మంత్రి పదవులు కోల్పోయారు.

Rajasthan: సొంత ప్రభుత్వంపై తీరుగుబాటు చేసినందుకు గాను గతంలో సచిన్ పైలట్ మీద కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మరోసారి పైలట్ మీద క్రమశిక్షణా చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం హెచ్చరికలను ఖాతరు చేయకుండా రాజస్థాన్‌‭లోని సొంత పార్టీ ప్రభుత్వంపైనే నిరసకు దిగిన ఆ పార్టీ నేత సచిన్ పైలట్ పై క్రమశిక్షణా వేటు పడనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని గత బీజేపీ సర్కార్ అవినీతిపై సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు తీసుకోవడం లేదంటూ సచిన్ పైలట్ మంగళవారం రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు.

Karnataka Polls: ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న మాజీ సీఎం

సొంత ప్రభుత్వంపైనే నిరసన తెలపడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమవుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం హెచ్చరించినప్పటికీ పైలట్ ముందుగా ప్రకటించిన విధంగానే దీక్ష చేశారు. ఈ విషయమై అధిష్ఠానం చాలా సీరియస్‌గా ఉందట. పైలట్‌పై ఈసారి చర్యలు ఉంటాయని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జి సుఖ్జిందర్ సింగ్ రంధావా తాజాగా తెలిపారు. ”సచిన్ పైలట్ లేవనెత్తిన అవినీతి అంశంతో నేను ఏకీభవిస్తాను. కానీ, ఆ అంశాన్ని లేవనెత్తిన విధానం సరికాదు. అసెంబ్లీ సమావేశంలో అవినీతి అంశాన్ని ఆయన ప్రస్తావించి ఉండవచ్చు. ఈరోజు సచిన్‌తో అరగంట సేపు చర్చించాను. రేపు కూడా మాట్లాడతాం. పరిస్థితిలను విశ్లేషించి తప్పిదం ఎవరదనే దానిపై నివేదిక సిద్ధం చేస్తాం” అని సుఖ్జిందర్ సింగ్ రంధావా తెలిపారు.

Uttar Pradesh: యోగీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. తెలివి లేని పనంటూ అక్షింతలు

గతంలో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఆయన తన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అంతే కాదు, తనతో తిరుగుబాటుకు సహకరించిన వారు కూడా మంత్రి పదవులు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు