Karnataka Polls: ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న మాజీ సీఎం

బుధవారం ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలోనే కలుసుకున్నారు. తన టికెట్ గురించే నడ్డాతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే హైకమాండ్ దీనిపై ఏమైనా హామీ ఇచ్చిందా అనే విషయాన్ని మాత్రం షెట్టర్ వెల్లడించలేదు

Karnataka Polls: ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న మాజీ సీఎం

BJP leader Jagadish Shettar at Delhi

Karnataka Polls: ఎన్నికలు వచ్చాయంటే టికెట్ల హడావుడి ప్రారంభం అవుతుంది. సీనియర్లే అయినా కొంత మందికి పార్టీ టికెట్లు దొరకవు. స్థానిక పార్టీల్లో అయితే ఈ విషయం ఇక్కడితోనే ఆగుతుంది. నచ్చితే పార్టీలో ఉంటారు, లేదంటే పార్టీ మారుస్తారు. కానీ జాతీయ పార్టీల్లో ఒక వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ టికెట్ రాకుంటే ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తుంటారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జగదీష్ షెట్టర్ పరిస్థితి ప్రస్తుం అలాగే ఉంది. బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు.

Rahul defamation case: రాహుల్ గాంధీ రెండేళ్ల జైలు శిక్ష స్టేపై ఉత్కంఠ.. కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్ పిటిషన్

బుధవారం ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలోనే కలుసుకున్నారు. తన టికెట్ గురించే నడ్డాతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే హైకమాండ్ దీనిపై ఏమైనా హామీ ఇచ్చిందా అనే విషయాన్ని మాత్రం షెట్టర్ వెల్లడించలేదు. అయితే షెట్టర్‭కు టికెట్ పై బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప హామీ ఇవ్వడం చూస్తే తొందరలో విడుదల చేసే రెండవ జాబితాలో షెట్టర్ పేరు చేర్చేందుకు హైకమాండ్ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. యడియూరప్ప సైతం 99 శాతం షెట్టర్‭కు టికెట్ వస్తుందని చెప్పడం ఇందుకు ఊతం ఇస్తోంది.

Karnataka Elections 2023: మేము ఇతర పార్టీల్లా కాదు.. బీజేపీ ఈ ప్రయోగాలు చేస్తోంది: సీటీ రవి

ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నాలుగు రోజులుగా కసరత్తు అనంతరం ఎట్టకేలకూ 189 మంది అభ్యర్థులతో తొలి జాబితా రూపొందించి విడుదల చేసింది. సీఎం బసవరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, ఇందులో 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చారు. మొత్తంగా 8 మంది మహిళలకు అవకాశం కల్పించారు. 32 ఓబీసీలకు, 30 ఎస్సీలకు, 16 ఎస్టీలకు టికెట్లు ఇచ్చారు. వరుణలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మంత్రి వి.సోమన్న తలపడనున్నారు. అలాగే కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మరో మంత్రి ఆర్‌.అశోక బరిలోకి దిగనున్నారు.