Uttar Pradesh: యోగీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. తెలివి లేని పనంటూ అక్షింతలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో ఒక ఆస్తికి సంబంధించిన రెవెన్యూ బకాయిలపై వివాదం నెలకొనడంపై సమాజ్‌వాదీ పార్టీ నేత యూసుఫ్ మాలిక్‌‌పై గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఎస్ఏ ప్రయోగించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్.కె.కౌల్, ఎ.అమానుల్లా సారథ్యంలోని ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది

Uttar Pradesh: యోగీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. తెలివి లేని పనంటూ అక్షింతలు

Supreme court

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా యోగి ప్రభుత్వాన్ని తెలివి లేదంటూ అక్షింతలు వేసింది. ఇంతకీ ఏ విషయంలో సుప్రీం ఇలా స్పందించిందనే కదా మీ అనుమానం..? రెవెన్యూ బకాయిలు అంశంలో సమాజ్‌వాదీ పార్టీ నేతపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం విచారింది. ఆ సందర్భంలోనే యోగి ప్రభుత్వ చర్యలపై ఆక్షేపణ తెలిపింది. ఉత్తరప్రదేశ్ సర్కార్‌‌పై తెలివి లేకుండా చేసిన పనిగా అక్షింతలు వేసింది. అధికార పరిధిపై సరైన కసరత్తు చేయలేదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. పిటిషనర్‌కు స్వేచ్ఛ ప్రసాదిస్తూ వెంటనే అతన్ని విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Karnataka Polls: ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న మాజీ సీఎం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో ఒక ఆస్తికి సంబంధించిన రెవెన్యూ బకాయిలపై వివాదం నెలకొనడంపై సమాజ్‌వాదీ పార్టీ నేత యూసుఫ్ మాలిక్‌‌పై గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఎస్ఏ ప్రయోగించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్.కె.కౌల్, ఎ.అమానుల్లా సారథ్యంలోని ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. కాగా, బుధవారం విచారణ అనంతరం యూసుఫ్ మాలిక్‌పై ఎన్ఎస్ఏ కేసు ప్రయోగించడంపై ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఎన్ఏస్ఐకి సంబంధించిన కేసా? అని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ”అధికార పరిధి గురించి సరిగా అవగాహన లేకుండా, బుర్ర ఉపయోగించకుండా పెట్టిన కేసు. ఎన్ఎస్ఏ కింద ఈ కేసు ప్రొసీడింగ్స్‌ను మేము కొట్టివేస్తున్నాం. పిటిషనర్‌కు తక్షణం విముక్తి కల్గించాలని ఆదేశిస్తున్నాం” అని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.