Amit Shah Deep Fake Video : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం.. ఏం జరగనుంది?

ఈ వీడియోని ఎవరు ఎడిట్ చేశారు? ఎవరు సర్కులేట్ చేశారు? దీనికి వెనుక ఎవరున్నారు? అనేది ఆరా తీశారు ఢిల్లీ పోలీసులు.

Amit Shah Deep Fake Video : రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా చేస్తున్న మాటల దాడి ఇవాళ పతాక స్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా టీమ్ కి చెందిన 10మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పది మందిలో నలుగురు తెలంగాణ వారే.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడకపోయినా.. రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటూ మాట్లాడినట్లు ఫేక్ వీడియోలను సృష్టించి సర్క్యులేట్ చేశారని దేశవ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన ఈ ప్రచారం.. అటు రాహుల్ గాంధీ కూడా అందుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని అన్నారు. తెలంగాణకు వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం.. రిజర్వేషన్ల రద్దు వివాదంపై స్పందించారు. రిజర్వేషన్ల రద్దు జరగదు, రిజర్వేషన్లు ఉంటాయని తేల్చి చెప్పారు.

ఈ రోజు తప్పుడు వీడియోని సోషల్ మీడియోలో ప్రచారం చేస్తున్నారు అంటూ దేశవ్యాప్తంగా 10మందికి నోటీసులు ఇస్తే.. అందులో తెలంగాణలో కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీశ్ సహా మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా సమన్లు ఇచ్చారని తెలుస్తోంది.

ఢిల్లీ నుంచి తెలంగాణ వచ్చిన పోలీసులు.. గాంధీభవన్ కు వెళ్లి స్వయంగా విచారించారు. ఈ వీడియో ఎవరు సర్కులేట్ చేశారు? దీనికి వెనుక ఎవరున్నారు? అనేది ఆరా తీశారు. మొత్తంగా ఫేక్ వీడియో అంశం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ముందు ముందు ఈ వ్యవహారంలో ఏం జరగనుంది? ఎవరికి బిగ్ షాక్ తగలనుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

పూర్తి వివరాలు..

 

ట్రెండింగ్ వార్తలు