Tdp Second List Effect On Alliance
Tdp Second List Effect : టీడీపీ రెండో జాబితా కూటమిలో చిచ్చు రాజేసింది. అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒకవైపు టీడీపీ నేతలు, మరోవైపు బీజేపీ సీనియర్లు సీట్ల ప్రకటనపై రగిలిపోతున్నారు. పిఠాపురంలో పోటీ చేస్తాను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు షాక్ తిన్నారు. పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు అన్యాయం జరుగుతోంది అంటూ ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు.
ఇక మరోవైపు విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో రహస్యంగా సమావేశం కావడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయనను చీపురుపల్లి వెళ్లమంటూ ఆదేశించిన టీడీపీ హైకమాండ్.. ఎటూ తేల్చకుండా ఆ సీటుని పెండింగ్ లో పెట్టేసింది.
ఇలా, మొత్తం 14 సీట్లను పెండింగ్ లో పెట్టిన టీడీపీ.. సీనియర్లకు ఝలక్ ఇచ్చింది. మొత్తంగా టీడీపీ సెకండ్ లిస్ట్ రగిల్చిన ఆగ్రహ జ్వాల, ఇవాళ్టి రాజకీయ పరిణామాలపై 10టీవీ రౌండప్ లో పూర్తి అనాలసిస్..
Also Read : సీనియర్లకు చంద్రబాబు షాక్..! టీడీపీ రెండో జాబితాలోనూ చోటు దక్కని కీలక నేతలు వీరే
పూర్తి వివరాలు..