ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఆ ముగ్గురు అధికారులకు బిగ్ షాక్..!

వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అనుకూలంగా పని చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు షాక్ తగిలింది.

IAS Transfers In AP : ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. పాలన, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు. తాజాగా ఐఏఎస్ అధికారులపై దృష్టి పెట్టారు.

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐఏఎస్ లను ట్రాన్స్ ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అనుకూలంగా పని చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు షాక్ తగిలింది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను జీఏడీకి(సాధారణ పరిపాలన శాఖ) అటాచ్ చేసింది చంద్రబాబు సర్కార్.

శ్రీలక్ష్మి స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రవీణ్ ప్రకాశ్ స్థానంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కోన శశిధర్ ను నియమించారు.

* రాష్ట్రంలో మొత్తం 19 మంది ఐఏఎస్‌లు బదిలీ
* పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీఏడీకి అటాచ్‌
* ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ జీఏడీకి అటాచ్‌
* పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ జీఏడీకి అటాచ్‌
* జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌
* పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్‌ కుమార్‌
* వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌
* కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
* పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌
* పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్‌ జైన్‌
* ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్‌ గౌర్‌
* నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌కు అదనపు బాధ్యతలు
* పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌
* ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శిగా కోన శశిధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
* ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ
* ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌
* ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
* ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకి
* పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్‌
* గనులశాఖ కమిషనర్‌, డైరెక్టర్‌గా తిరుపతి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌
* ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు
* తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు
* జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని మురళీధర్‌రెడ్డికి ఆదేశాలు
* ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్‌ చంద్‌

గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.
శ్రీలక్ష్మి
ప్రవీణ్ ప్రకాష్
రజత భార్గవ్

విశ్రాంత చీఫ్ ఇంజినీర్ ఎం. వెంకటేశ్వర రావును జలవనరుల శాఖ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు.
రెండేళ్ళ పాటు సలహాదారు పదవిలో కొనసాగునున్న వెంకటేశ్వ రావు.

ఐఏఎస్ ల బదిలీలు జరిగిన తీరు చూస్తుంటే.. సీఎం చంద్రబాబు మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని అధికారవర్గాలు అంటున్నాయి. కీలకమైన శాఖలు కలిగి ఉన్న అధికారులను బదిలీ చేయడం జరిగింది. కొంతమంది సీనియర్లను సైతం పక్కన పెట్టింది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు తన పాలనను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు అనువుగా ఐఏఎస్ లను బదిలీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే జగన్ కు సన్నిహితులుగా ముద్రపడ్డ ఐఏఎస్ లను ఆయన పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. కీలకమైన శాఖలను సీనియర్లకు అప్పగించారు చంద్రబాబు. గతంలో తన దగ్గర పని చేసిన టీమ్ ను కీలక పోస్టుల్లో పెట్టి పాలనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తంగా పాలనపై మరింత పట్టు సాధించే దిశగా చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి.

Also Read : అన్నది చేసి చూపిస్తున్న సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ తిరుమల షురూ..!

 

ట్రెండింగ్ వార్తలు