CM Jagan : జగన్ దూకుడు.. ఒకేసారి 175 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన..‍!

175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్న జగన్.. 60 నుంచి 65 చోట్ల మార్పులు చేర్పులు చేశారు.

CM Jagan To Announce 175 Candidates List

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ స్పీడ్ పెంచారు. 2024 ఎలక్షన్ టీమ్ ను అప్పుడే సిద్ధం చేసేశారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఫైనల్ లిస్ట్ ను రెడీ చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్న జగన్.. 60 నుంచి 65 చోట్ల మార్పులు చేర్పులు చేశారు. దీనిపై రేపు లేదా ఎల్లుండి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక, కొత్త సంవత్సరం నుంచి అభ్యర్థులంతా ప్రజల్లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

గతంలో ఏ రాజకీయ పార్టీ తీసుకోని నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారు. అభ్యర్థుల మార్పునకు సంబంధించిన కసరత్తు పూర్తి అయ్యింది. ఏకంగా 60 నుంచి 70 స్థానాల వరకు మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు చేసిన సీఎం జగన్ లిస్ట్ సిద్ధం చేసేశారు. కొంత మంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా, కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దింపనున్నారు జగన్.

Also Read : పవన్ కల్యాణ్ వేట.. గెలుపు గుర్రాల ఎంపిక కోసం స్వయంగా రంగంలోకి, ముందుగా అక్కడి నుంచే

ఎవరినైతే మార్పు చేశారో, ఎవరికైతే టికెట్ లేదో వారందరినీ కూడా తాడేపల్లికి పిలిపించుకుని నేరుగా తానే మాట్లాడారు జగన్. వారికి పరిస్థితులను స్వయంగా వివరించారు. ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది? ఎందుక టికెట్ ఇవ్వలేదు? అనే దానిపై వారికి క్లారిటీ ఇచ్చారు జగన్. మార్పులు, చేర్పులు తర్వాత ఎట్టకేలకు ఫైనల్ లిస్ట్ సిద్ధం చేశారు జగన్. రేపు లేదా ఎల్లుండి 175 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

అభ్యర్థుల మార్పు అంశంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకున్నారు జగన్. ప్రజా వ్యతిరేకత, ఎమ్మెల్యేల పని తీరు, సామాజిక సమీకరణాలు.. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నారు జగన్. సామాజిక సమీకరణాలు అధిక ప్రభావం చూపాయని చెప్పాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈసారి జగన్ పెద్ద పీట వేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బలంగా ఉన్నాడో వారికే జగన్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?

దీంతో ఈసారి 30మంది కొత్త వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 15మంది వరకు ఎంపీలుగా వెళ్లబోతున్నారు. ఎంపీలుగా ఉన్న వారిలో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు. కొంతమందిని పూర్తి పక్కన పెట్టనున్నారు. తాడేపల్లి కార్యాలయం కేంద్రంగా గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు పూర్తి చేసేశారు జగన్.

 

ట్రెండింగ్ వార్తలు