ఆంధ్రుల కలల సౌధాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఎలా పూర్తి చేయాలి? చంద్రబాబుకు సవాల్‌గా మారిన రాజధాని నిర్మాణం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా అమరావతిలో పర్యటించారు చంద్రబాబు. గడిచిన ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన అమరావతిని చూసి, చలించిపోయారు.

Ap Capital Amaravati Construction : ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఎలా మొదలు పెట్టాలి? ముందుకు సాగే ప్రణాళికలు ఎలా ఉండాలి? అసలు ఏమీ లేనప్పుడు ఎన్నైనా అద్భుతాలు చేయొచ్చు. కలల సాకారానికి సరికొత్త మార్గాల్లో అన్వేషణ సాగించొచ్చు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు. కానీ, అభివృద్ధిని బలంగా ఆపేసిన చోట ఏం చేయాలి? పునర్ వైభవాన్ని సాధించేందుకు ఉన్న అవకాశాలు ఏంటి? అర్ధాంతరంగా నిలిచిపోయిన ఆశల సౌధాన్ని తిరిగి నిలబెట్టడానికి ఏం చేయాలి?

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యత చేపట్టిన సీఎం చంద్రబాబు ముందున్న ప్రశ్నలివి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా అమరావతిలో పర్యటించారు చంద్రబాబు. గడిచిన ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన అమరావతిని చూసి, చలించిపోయారు.

అమరావతి నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఏంటి? రాజధాని నిర్మాణం కల సాకారం చేసేందుకు చంద్రబాబు ఏం చేయబోతున్నారు? టీడీపీ ప్రభుత్వం చెప్పినట్లుగా రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటే తక్షణం చేపట్టాల్సిన చర్యలు ఏంటి?

Also Read : రాజకీయాలకు పనికి రారని తిట్టారు, జనసేన మూసేయాలని విమర్శించారు.. కట్ చేస్తే..

ట్రెండింగ్ వార్తలు