నాకు ప్రమాదం జరగాలని అనుకుంటున్నారా?- జగన్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద గడీలు కట్టుకుని మీరు బతికితే సరిపోతుందా? మిగతా వాళ్లకు, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా?

YS Sharmila Slams CM Jagan

YS Sharmila : జగన్ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సీఎం జగన్ టార్గెట్ గా షర్మిల చెలరేగిపోయారు. తనకు సెక్యూరిటీ కల్పించే విషయంలో జగన్ ప్రభుత్వ వైఖరిపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాకు ఏదైనా ప్రమాదం జరగాలని అనుకుంటున్నారా? నాకు చెడు జరగాలని కోరుకుంటున్నారా? అంటూ జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు షర్మిల.

‘నేను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిని. ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేమీ పట్టనట్లు, ఒక మహిళ అని కూడా చూడకుండా, ఓ పార్టీకి అధ్యక్షురాలిని అని కూడా పట్టించుకోకుండా.. ఇవాళ మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే.. మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ఇది ప్రజాస్వామ్యం అన్న ఆలోచన ఉందా? గుర్తుందా?

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ? పొత్తుతో కలిగే లాభాలు ఏంటి, ఎదురయ్యే సవాళ్లు ఏంటి..

మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద గడీలు కట్టుకుని మీరు బతికితే సరిపోతుందా? మిగతా వాళ్లకు, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే.. మా చెడు కోరుకుంటున్నారు అనే కదా దాని అర్థం. మాకు ఏదైనా ప్రమాదం జరగాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కలిపించే వాళ్లలో కూడా మీ వాళ్లు ఉంటారనే కదా అర్థం. అదే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?” అని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.

అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు సీఎం జగన్ పైనా విరుచుకుపడ్డారు షర్మిల. ” ఒకరేమో కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు. ఒకరేమో కుర్చీ ఎలా సంపాదించాలి అనే పనిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజల గురించి ఏ ఒక్కరికీ అటు చంద్రబాబుకి ఇటు జగన్ కి అవసరం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరవాలి. ఈ బీజేపీ తొత్తు పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన లను ఇంటికి పంపించాలి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధ్యపడుతుంది” అని తేల్చి చెప్పారు షర్మిల.

”అసెంబ్లీ జరుగుతోంది. కనీసం ఈసారైనా అటు పాలక పక్షమైనా ఇటు ప్రతిపక్షమైనా ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రతిపక్ష నాయకుడికి, పాలకపక్ష ముఖ్యమంత్రి జగన్ అన్నకి లేఖలు రాశాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఒక తీర్మానం చేయాలని సూచించడం జరిగింది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి మేము డిమాండ్ చేశాం. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి. రాజధాని సాకారం చేసుకోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి.

Also Read : ఆ రెండు కులాలకే ఎమ్మెల్యే ఛాన్స్‌.. రామచంద్రపురంలో ఆసక్తికర రాజకీయం!

గత పదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే. అయినా కూడా ఒక్క సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు. ఇంతకుముందు ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు. కానీ, ఇప్పటివరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరూ కూడా ఆలోచన చేసింది లేదు. స్వలాభం కోసమ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టింది చాలు.

కనీసం, ఈసారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఒకటి అసెంబ్లీలో పాస్ చెయ్యాలి. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అంశాల్లో బీజేపీ మనకు ఎందుకు ద్రోహం చేసిందో అన్న దానిపై అసెంబ్లీలో చర్చ జరగాలి. ఈ తీర్మానాన్ని రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలి అని డిమాండ్ చేశాం. దయచేసి ఈసారైనా అటు పాలకపక్షం, ఇటు ప్రతిపక్షం ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది” అని వైఎస్ షర్మిల అన్నారు.

Also Read : సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశ్ రావు