సీఎం జగన్ తీవ్ర ఆరోపణల తర్వాత గవర్నర్‌ను కలిసిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్
ఏపీ రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. కరోనా కారణంగా ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు ఎస్ఈసీ రమేష్ కుమార్. దీనిపై సీఎం

ఏపీ రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. కరోనా కారణంగా ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు ఎస్ఈసీ రమేష్ కుమార్. దీనిపై సీఎం
ఏపీ రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. కరోనా కారణంగా ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు ఎస్ఈసీ రమేష్ కుమార్. దీనిపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రమేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని జగన్ ఫైర్ అయ్యారు. దీనిపై ఆయన గవర్నర్ విశ్వభూషణ్ కు ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. దీంతో స్థానిక ఎన్నికల వాయిదా పంచాయతీ గవర్నర్ దగ్గరకు చేరింది.
See Also | గవర్నర్ వద్దకు ఏపీ ‘స్థానిక’ పంచాయతీ : వివరాలతో ఈసీ రమేశ్ రెడీ..ఏం చెబుతారు
ఎన్నికల వాయిదా నిర్ణయానికి దారితీసిన పరిస్థితుల వివరణ:
గవర్నర్ పిలుపుతో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గవర్నర్ దగ్గరికి వెళ్లారు. సోమవారం(మార్చి 16,2020) ఉదయం ఆయన గవర్నర్ ను కలిశారు. గవర్నర్ తో భేటీ అయిన రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను, కారణాలను వివరిస్తున్నారు.
గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
రమేష్ కుమార్ గవర్నర్ కు ఎలాంటి రిపోర్టు ఇస్తారు? తన నిర్ణయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? అనేది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సీఎం జగన్ తీవ్ర ఆరోపణల తర్వాత రమేష్ కుమార్ గవర్నర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కమిషనర్ వివరణ తర్వాత గవర్నర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.
సిగ్గుంటే, రమేష్ కుమార్ రాజీనామా చెయ్యాలి:
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. విచక్షణాధికారాలను ఉపయోగించి ఎన్నికలు వాయిదా వేసినట్లు రమేశ్ చెప్పడంపై జగన్ చాలా సీరియస్‌గా ఉన్నారు. విచక్షణాధికారం అనే పదం వాడటం ప్రతొక్కరికి అలవాటైపోయిందని మండిపడ్డారు. రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళతామని వైసీపీ శ్రేణులు ప్రకటించాయి. సిగ్గుంటే.. రమేష్ కుమార్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలక అతీతంగా వ్యవహరించాల్సిన అధికారి..ఇలా టీడీపీకి వత్తాసు పలకడం దారుణం అన్నారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలను రమేష్ కుమార్ తోసిపుచ్చారు. కరోనా వైరస్, పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలోనే ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు.
See Also | ఏపీలో కరోనా లేదు, స్థానిక ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని ఈసీకి సీఎస్ లేఖ