CM Jagan Foucs On YCP Third List
YCP Third List : వైసీపీ ఇంఛార్జిల మార్పులు చేర్పులపై మూడో లిస్టు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. దీంతో పాటు ఇప్పటికే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వైసీపీ నేతలు క్యూ కట్టారు. నరసరావుపేట పార్లమెంట్ ఇంఛార్జి నియామకంపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఎంపీ అభ్యర్థి ఎంపికపై పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చించారు.
లావు శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట నుంచి పోటీ చేయించాలని ఎమ్మెల్యేలు కోరారు. అయితే, అధిష్టానం మాత్రం శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది. నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని లావు ఇప్పటికే అధిష్టానానికి చెప్పారు. ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం? టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ పద్మనాభం?
ఇవాళ ఉదయం నుంచి మరికొందరు వైసీపీ నేతలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఉదయం జోగి రమేశ్ తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి సీఎం జగన్ ను కలిశారు. మధ్యాహ్నం తర్వాత పల్నాడుకి చెందిన నేతలు వచ్చారు. ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంట్ స్థానం అభ్యర్థిపై కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు పంపాలని అధిష్టానం ఆదేశించింది.
అయితే, తాను గుంటూరు వెళ్లనని, నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు అందరూ ఇవాళ క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేశ్ రెడ్డి.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను కలిశారు.
Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్
ముఖ్యంగా పార్లమెంటు స్థానానికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలునే కొనసాగించాలని ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను అడిగినట్లు సమాచారం. గతంలో తాను నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలిచాను, నిధులన్నీ వెచ్చింది ఇక్కడ అభివృద్ది చేశాను, కాబట్టి కచ్చితంగా గెలుపు అవకాశాలు నాకున్నాయి, కచ్చితంగా నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ అధిష్టానానికి గతంలోనే చెప్పారు. అయితే, అధిష్టానం లెక్కలు వేరేలా ఉన్నాయి. తప్పనిసరిగా గుంటూరు నుంచి పోటీ చేయాలని అంటున్నారు. నరసరావుపేటకు బీసీ అభ్యర్థిని తీసుకొస్తామంటోంది. నరసరావుపేట పార్లమెంట్ స్థానం వ్యవహారానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.