గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్

పార్టీలో చేరికలు, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు, నిధుల సమీకరణ, అధికార యంత్రాంగం మద్దతు.. ఇలా అన్ని వనరులు సమీకరించుకోవడం, సేకరించుకోవడం తేలిక అవుతుంది.

గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్

Feel Factor Politics

Updated On : January 10, 2024 / 12:24 AM IST

Feel Factor : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇదే ఇప్పటి రాజకీయాలను శాసిస్తున్న గెలుపు తంత్రం. వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు, ప్రత్యర్థులపై పైచేయి సాధించే తంత్రాలు, మంత్రాలు.. ఇటువంటివి ఏవీ ఇప్పుడు పని చెయ్యడం లేదు. గెలుస్తున్నాం అన్న భావనే జనాలను ఆకట్టుకుంటోంది. తెలంగాణలో జరిగింది, త్వరలో ఏపీలో జరగబోయేది ఈ ఫీల్ గుడ్ గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

గెలుస్తున్నాం, గెలిచేస్తున్నాం అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఫీల్ ఫ్యాక్టర్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మిగతా అంశాలన్నీ ఒక్కొక్కటిగా సానుకూలంగా మారతాయనేది ఇప్పుడు రాజకీయ పక్షాలు నమ్ముతున్న సిద్ధాంతం. ఎప్పుడైతే ఒక పార్టీ గెలుస్తుందని జనంలోకి బాగా వెళ్తుందో.. ఆటోమేటిక్ గా మిగతా అంశాలు అనుకూలంగా మారుతున్నాయి. పార్టీలో చేరికలు, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు, నిధుల సమీకరణ, అధికార యంత్రాంగం మద్దతు.. ఇలా అన్ని వనరులు సమీకరించుకోవడం, సేకరించుకోవడం తేలిక అవుతుంది.

Also Read : గుంటూరులో ఎన్నికల వేడి.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?

అందుకే ఈ అంశంపై ప్రధానంగా రాజకీయపక్షాలు దృష్టి పెడుతున్నాయి. తాము గెలుస్తున్నాం అని చెప్పడంతో పాటు ప్రత్యర్థుల పనైపోయింది, వాళ్లు గెలిచే పరిస్థితి లేదని చెప్పడం ద్వారా ఎన్నికల్లో పైచేయి సాధిస్తున్నారు. తెలంగాణలో ఈ వ్యూహం కొట్టొచ్చినట్లు కనిపించింది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పనైపోయింది అనే టాక్ వినిపించింది. ఇదంతా ఓ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ గెలుస్తుందనే భావన ప్రజల్లోకి చొప్పించడంలో హస్తం నేతలు సక్సెస్ అయ్యారు. అందుకే ఏపీలో ఇప్పుడు ప్రధాన పార్టీలు ఈ ఫ్యాక్టర్ నే నమ్ముకుని ఎన్నికల రణరంగానికి అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి.

Also Read : పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?

ప్రసుత్తం ఫీల్ ఫ్యాక్టరే ఎలక్షన్ మూడ్ ను సెట్ చేస్తోంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేని తటస్తులు ఫీల్ ఫ్యాక్టర్ కు ఆకర్షితులై గెలిచే అవకాశం ఉందన్న పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా మూడు నుంచి ఐదు శాతం ఓటర్లు స్వింగ్ అవుతుండటంతో పార్టీలు అంచనాలకు అందని విధంగా విజయం సాధిస్తున్నాయని చెబుతున్నారు పరిశీలకులు. తెలంగాణలో ఫీల్ ఫ్యాక్టరే తమకు సానుకూల వాతావరణం కల్పించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం చూస్తే ఫీల్ గుడ్ భావన పార్టీల చేతిలో మంత్రదండంగా పని చేస్తోందని నిస్సకోచంగా చెప్పొచ్చు.