Assigned Lands Scam : ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు..! రూ.4వేల కోట్ల అసైన్డ్ భూముల స్కామ్‌లో సీఐడీ ఛార్జ్‌షీట్

చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసినట్లు ఛార్జ్ షీటులో పొందుపరిచింది సీఐడీ. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు నిర్ధారించింది.

Assigned Lands Scam

Assigned Lands Scam : అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీఐడీ. అసైన్డ్ భూముల స్కామ్ లో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పేర్లను పొందుపరిచారు. 4వేల 400 కోట్ల అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్లుగా సీఐడీ నిర్ధారించింది. 1100 ఎకరాల అసైన్డ్ భూముల్లో స్కామ్ జరిగినట్లు సీఐడీ పేర్కొంది. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయినిపాలెం, ఇతర గ్రామాలలో కుంభకోణం జరిగినట్లు ఛార్జిషీటులో పేర్కొంది సీఐడీ. అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా ఇచ్చినప్పటికీ ఉద్దేశ్య పూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించారని సిఐడి అధికారులు పేర్కొన్నారు.

చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసినట్లు ఛార్జ్ షీటులో పొందుపరిచింది సీఐడీ. మంగళగిరి తదితర సబ్ రిజిస్టర్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని అభియోగాలు మోపింది సిఐడి. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు, నారాయణతో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అధికారులు.

Also Read : ఈ రెండు స్థానాల్లో పోటీ చేయనున్న పవన్ కల్యాణ్?

ట్రెండింగ్ వార్తలు