ఈ రెండు స్థానాల్లో పోటీ చేయనున్న పవన్ కల్యాణ్?

భీమవరం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

ఈ రెండు స్థానాల్లో పోటీ చేయనున్న పవన్ కల్యాణ్?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోక్‌సభతో పాటు అసెంబ్లీ నియోజక వర్గంలోనూ పోటీ చేయనున్నట్లు తెలిసింది. బీజేపీ హైకమాండ్ ఆలోచన మేరకు రెండు చోట్ల పవన్ పోటీ చేయనున్నట్లు సమాచారం. కాకినాడ పార్లమెంట్, పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

తిరుపతి నుంచి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ పై ఒత్తిడి ఉంది. భీమవరం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. భీమవరం బరిలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నిలుస్తారని సమాచారం. రేపు జనసేనలో అంజిబాబు చేరనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ కూడా కలిసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలన్న విషయంపై ఆ మూడు పార్టీలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఎన్డీయేను విస్తరించాలని బీజేపీ చూస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు కుదిరిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ప్రకటించారు.

Also Read: గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలను వాళ్లు అంతగా పెంచారు: రేవంత్ రెడ్డి