Bhuma Jagat Vikhyat Reddy : ఇది వారి పనే.. ఏవీ సుబ్బారెడ్డితో కలిసి కుట్ర చేశారు- భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి

Bhuma Jagat Vikhyat Reddy : మా అక్క అఖిలప్రియ చున్నీ లాగి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి మీదనే ఇలా జరిగితే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి?

AV Subba Reddy-Bhuma Akhila Priya : ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య జరిగిన ఘర్షణ వ్యవహారంపై అఖిలప్రియ తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇది టీడీపీ, టీడీపీ ఘర్షణ కాదన్నారు విఖ్యాత్ రెడ్డి. అధికార పార్టీ వాళ్లు రెచ్చగొట్టి చేసిందేనని ఆరోపించారు. అన్యాయంగా కేసు పెట్టి మా అక్కను జైల్లో పెట్టారని విఖ్యాత్ రెడ్డి వాపోయారు.

ఏవీ సుబ్బారెడ్డితో కలిసి ఇది కచ్చితంగా అధికార పార్టీ పన్నిన కుట్ర అని ఆరోపణలు చేశారు. ఏవీ సుబ్బరెడ్డి మా అక్క చున్నీ పట్టుకుని లాగి దుర్భాషలాడారని విఖ్యాత్ రెడ్డి చెప్పారు. పాదయాత్రలో మా అక్క అఖిలప్రియ చున్నీ లాగి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏవీ సుబ్బారెడ్డి చేశారని తెలిపారు. ఏవీ సుబ్బారెడ్డిపై 307 సెక్షన్ కింద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనక బలమైన రాజకీయ హస్తం ఉందన్నారు.

Also Read..Chandrababu : రాజధాని పేరుతో జగన్ నాటకాలు.. ఏపీ క్యాపిటల్ అమరావతే : చంద్రబాబు

ఆళ్ళగడ్డలో యువగళం పాదయాత్ర విజయవంతం అవుతుందనే భయంతోనే అధికార పార్టీ ఈ కుట్ర పన్నినట్లు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆళ్ళగడ్డలో కచ్చితంగా యువగళం పాదయాత్ర కొనసాగుతుందన్నారు. మాజీమంత్రి మీదనే ఇలా జరిగితే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? అని జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీ వాళ్లే ఇన్వాల్వ్ అయి ఆళ్లగడ్డలో లోకేశ్ పాదయాత్ర క్యాన్సిల్ చేయాలని చూస్తున్నారని అన్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని జగత్ విఖ్యాత్ రెడ్డి నిలదీశారు.

అసలేం జరిగిందంటే..
టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీమంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జి భూమా అఖిలప్రియా, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల కోర్టు అఖిలప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వారిని కర్నూల్ జైలుకి తరలించారు. టీడీపీ నేత నారాలో లోకేశ్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా కొత్తపల్లి దగ్గర ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. భూమా అఖిలప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఇంతకాలం కనిపించని నువ్వు ఇప్పుడెందుకు వచ్చావంటూ సుబ్బారెడ్డిపై అఖిల‌ప్రియ అనుచ‌రులు దాడిచేశారు. ఆ సమయంలో భూమా అఖిలప్రియ అక్కడే ఉన్నారు. లోకేశ్ సమక్షంలోనే ఈ దాడి జరగడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.

Also Read..Nara Lokesh PadaYathra : పాదయాత్రలో నారా లోకేష్‌కు అస్వస్థత .. నంద్యాలలో ఆస్పత్రిలో టెస్టులు, చికిత్స

ట్రెండింగ్ వార్తలు