Nara Lokesh PadaYathra : పాదయాత్రలో నారా లోకేష్‌కు అస్వస్థత .. నంద్యాలలో ఆస్పత్రిలో టెస్టులు, చికిత్స

50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న లోకేశ్ కర్నూలు జిల్లాలోని నంద్యాలలో యాత్ర కొనసాగుతున్న క్రమంలో అవస్వస్థతకు గురి అయ్యారు.దీంతో లోకేశ్ నంద్యాలలోని మ్యాగ్న ఎమ్ఆర్ఐ సెంటర్ లో స్కానింగ్ చేరుకున్నారు.

Nara Lokesh PadaYathra :  పాదయాత్రలో నారా లోకేష్‌కు అస్వస్థత .. నంద్యాలలో ఆస్పత్రిలో టెస్టులు, చికిత్స

Nara Lokesh

Yuvagalam padayatra : యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ అస్వస్థతకు గురి అయ్యారు. గత 50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న లోకేశ్ కర్నూలు జిల్లాలోని నంద్యాలలో యాత్ర కొనసాగుతున్న క్రమంలో స్వల్ప అవస్వస్థతకు గురి అయ్యారు.దీంతో లోకేశ్ నంద్యాలలోని మ్యాగ్న ఎమ్ఆర్ఐ సెంటర్ లో స్కానింగ్ చేరుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో ప్రజలు లోకేశ్ పాదయాత్రకు భారీగా తరలివచ్చారు. తమ మద్దతు తెలిపారు. లోకేశ్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయం అయ్యింది. అప్పటినుంచి ఆ నొప్పిని భరిస్తునే పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

50 రోజులు దాటిపోయినా ఇంకా నొప్పి తగ్గకపోవడం తో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్ల సూచించారు. ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా నొప్పి తగ్గకపోవటంతో నంద్యాలో యాత్ర కొనసాగుతుండగా భుజం నొప్పి బాగా ఎక్కువైంది. తీవ్ర ఇబ్బంది పెడుతుండటంతో డాక్టర్ల సూచనమేరకు లోకేశ్ నంద్యాలలోని మ్యాగ్న ఎమ్ఆర్ఐ సెంటర్ లో స్కానింగ్ చేరుకున్నారు. నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ కి చేరుకున్న నారా లోకేష్. కుడి భుజానికి స్కానింగ్ చేయించుకున్నారు. అనంతరం డాక్టర్ల సూచన మేరకు పాదయాత్రను కొనసాగిస్తారని సమాచారం.

కాగా రెండు రోజుల క్రితమే నారా లోకేశ్ పాదయాత్ర 100రోజులు పూర్తి చేసుకుంది. జనవరి 27 చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్‌ పాదయాత్ర కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకర్గంలో 100 రోజులకు చేరుకుంది. లోకేష్‌ పాదయాత్రకు మద్దతుగా ఆయన తల్లి భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు యాత్రలో పాల్గన్నారు. దారి మధ్యలో అమ్మ భువనేశ్వరి షూలేస్‌ ఊడిపోవడంతో.. తానే స్వయంగా లేస్‌ కట్టారు లోకేష్‌. యాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మోతకూరు వద్ద పైలాన్‌ను ఆవిష్కరించారు.