Chandrababu : రాజధాని పేరుతో జగన్ నాటకాలు.. ఏపీ క్యాపిటల్ అమరావతే : చంద్రబాబు

విశాఖపట్నంపై సైకో జగన్ కన్ను వేశాడని తెలిపారు. విశాఖ వాసులకు రౌడీయిజం తెలియదన్నారు.

Chandrababu : రాజధాని పేరుతో జగన్ నాటకాలు.. ఏపీ క్యాపిటల్ అమరావతే : చంద్రబాబు

Chandrababu Fire Jagan

Chandrababu Fire Jagan : సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. సైకో ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు ఎవ్వరైనా ఆనందంగా ఉన్నారా అని అడిగారు. దేశంలోనే పెట్రోలు, డీజీల్ ధరలు ఏపీలోనే ఎక్కువ అన్నారు. ఏపీలో అడుగడుగునా అవినీతి, దోపిడి రాజ్యమేలుతోందని విమర్శించారు. విశాఖ జిల్లా పెందుర్తిలో చంద్రబాబు మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రజలకు బాధలు తప్పవన్నారు.

రాష్ట్రానికి శని ముఖ్యమంత్రి ఉన్నాడని మండిపడ్డారు. వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణ రాజును పోలీసులు కొడుతుంటే, ఆ వీడియో చూసి జగన్ ఆనందపడ్డారని చెప్పారు. బాబాయ్ ని చంపింది అబ్బాయేనని ఆరోపించారు. బాబాయ్ ను లేపేసి ఆ నెపం తనపై వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులోనే కోడికత్తి డ్రామా ఆడారని పేర్కొన్నారు. అమరావతిలో తాను అద్దె ఇంటిలో ఉంటున్నానని చెప్పారు. ఆ అద్దె ఇళ్ళు కూల్చి వేయాలని జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు.

Tirupati Gangamma Jathara 2023 : గంగమ్మ గుడిని కూడా వదలని ‘J’ ‘గన్’.. పిచ్చి పట్టిందా? జగన్ : చంద్రబాబు ఫైర్

కరోనా సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ ను వైసీపీ నేతలు చిత్రహింసలు పెట్టారని విమర్శించారు. రాజధాని పేరుతో జగన్ నాటకాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని స్పష్టం చేశారు. విశాఖపట్నంపై సైకో జగన్ కన్ను వేశాడని తెలిపారు. విశాఖ వాసులకు రౌడీయిజం తెలియదన్నారు. గతంలో భోగాపురం ఎయిర్ పోర్టును వ్యతిరేకించిన జగన్.. ఇప్పుడు భోగాపురం ఎయిర్ ఫోర్టుకు శంకుస్థాపన చేశాడని పేర్కొన్నారు.

దేశంలోనే జగన్ ధనిక సైకో ముఖ్యమంత్రి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది ధనిక ముఖ్యమంత్రికి-నిరుపేదలకు మద్య జరిగే పోరాటంగా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పేద ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సైకో జగన్ పుట్టకముందే టీడీపీ సంక్షేమ పథకాలు ఇచ్చిందని గుర్తు చేశారు. సంక్షేమ సారధి ఎన్టీరామారావు అని, ఏపీని కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.

Kodali Nani : ఆర్‌5 జోన్ పై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన కొడాలి నాని

వచ్చే ఎన్నికలు కురుక్షేత్రం అన్నారు. ఈ సైకో జగన్ లాంటి వేలాదిమంది నేరస్తులను అణిచివేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. జగన్ పని అయిపోయిందని, వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరు గెలవరని జోస్యం చెప్పారు.  ఒక్క సీటు కూడా గెలవరని, 175 కాదు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు.

తమ పార్టీలో కార్పొరేటర్ గా గెలిచిన వ్యక్తి తనను, పవన్ కల్యాణ్ ను తిడుతున్నాడని మండిపడ్డారు. విశాఖ ప్రజలు తనను ఎప్పుడూ ఆదరించారని అన్నారు. హుద్ హుద్ తుపాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచానని చెప్పారు. విశాఖను అభివృద్ధి చేసే బాద్యత టీడీపీదేనని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.