Tirupati Gangamma Jathara 2023 : గంగమ్మ గుడిని కూడా వదలని ‘J’ ‘గన్’.. పిచ్చి పట్టిందా? జగన్ : చంద్రబాబు ఫైర్

వందల ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ జాతరను కూడా వైసీపీ వదిలి పెట్టలేదు. తన ప్రచారం కోసం అడ్డగోలుగా వాడేసుకుంది. గంగమ్మ గుడికి చేసిన పువ్వుల అలంకారంలో ‘గన్’బొమ్మ్ ప్రత్యక్షమైంది. సీఎం జగన్ పేరు వచ్చేలా తెలివిగా వైసీపీ జెండాలు..జగన్ పేరు వచ్చేలా డెకరేట్ చేసారు.

Tirupati Gangamma Jathara 2023 : గంగమ్మ గుడిని కూడా వదలని ‘J’ ‘గన్’.. పిచ్చి పట్టిందా? జగన్ : చంద్రబాబు ఫైర్

Tirupati Gangamma Jathara

‘J Gun ’ Gangamma Jathara : తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ జాతరలో కూడా వైసీపీ ప్రభుత్వం తనదైన శైలిలో ఎలివేషన్ చేసుకుంది. తన భజనే చేసుకుంది. గంగమ్మ గుడికి చేసిన పువ్వుల అలంకారంలో వైసీపీ ప్రత్యక్షమైంది. సీఎం జగన్ పేరు కనిపించేలా వినూత్నంగా పుష్పాలంకణ చేయటం వివాదంగా మారింది. గంగమ్మ గుడికి పుష్పాలంకరణలో ‘గన్’ఆకారం తీవ్ర వివాదానికి దారి తీసింది. భక్తి పారవశ్యం కలగాల్సిన చోట సీఎం జగన్ పేరు వచ్చేలా వినూత్నంగా అతి తెలివితేటలు ప్రదర్శిస్తు ‘J’ ‘గన్’ బొమ్మ ఉండటం తీవ్ర కలకలం రేపింది.

గుడి బయట పూలతో చేసిన డెకరేషన్లలో రెండు వైపులా వైసీపీ జెండాలు, మధ్యలో ఇంగ్లిష్ J అక్షరం తర్వతా గన్ గుర్తు వచ్చేలా చేశారు. ఇది చాలా పకడ్బంధీగా వచ్చేలా చేసినట్లుగా పక్కాగా తెలుస్తోంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ లో దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తు వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడ్డారు. గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? దేవుని సన్నిధిలో ఈ ‘గన్’ సంస్కృతి ఏంటి ? వైసీపీ జెండా గుర్తులు ఏంటి? పిచ్చి పట్టిందా? ‘J’ అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ళ దగ్గర ఇలాంటి వేషాలా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ కూడా అలంకరణ ఫోటోను ట్విట్టర్‌ లో పోస్ట్ చేసి వైసీపీ నేతల తీరును తప్పు పట్టారు.

ఈ పుష్పాలంకరణ తీవ్ర వివాదానికి విమర్శలకు దారి తీయటంతో గంగమ్మ గుడి అధికారులు తొలగించినట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు, నారా లోకేష్ ట్వీట్ చేయడంతో ఈ విషయం వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేవుడితో కూడా పరాచికాలా? మరీ ఇంత అహంకారమా? అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. దేవాల‌యాల‌పై గ‌న్ బొమ్మ‌లు వేస్తున్నారంటే, ప్ర‌జ‌ల్నేకాదు, దేవుళ్ల‌నీ బెదిరిస్తున్న‌ట్టే అని లోకేశ్ మండిపడ్డారు.

కాగా ప్రతి ఏడాది మే నెలలో గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది. తొమ్మిది వందల ఏళ్లుగా వస్తున్న ఆచారంతోనే ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వరంలో గంగమ్మ జాతర నిర్వహణ జరుగుతుంది. ఈక్రమంలో వైసీపీ ప్రభుత్వం గంగమ్మ జాతరను కూడా తన ప్రచారం కోసం వాడేసుకోవటం విమర్శలకు దారితీసింది.