కరోనాపై భట్టి విక్రమార్క కామెంట్స్..కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

  • Publish Date - March 14, 2020 / 09:08 AM IST

కరోనా వైరస్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం సాగింది. కరోనాపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసలు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భట్టి ఆరోపించారు. దీనిపై మాట్లాడిన కేసీఆర్… ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2020, మార్చి 14వ తేదీన శనివారం అసెంబ్లీ సమావేశాల్లో కరోనా వైరస్‌పై ప్రతిపక్ష, అధికారపక్ష మధ్య మాటల తూటాలు పేలాయి. 

మల్లు వ్యాఖ్యలు : –
కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టడం లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. సౌదీ అరేబియా నుంచి కర్నాటక రాష్ట్రానికి ఓ వ్యక్తి వచ్చి..అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చాడని తెలిపారు. తలాబ్ గడ్డ అనే ప్రాంతంలో ఒక ఐదు రోజులు ఉండి..రెండు ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని..కర్నాటక రాష్ట్రానికి వెళ్లిన తర్వాత..చనిపోయాడని అసెంబ్లీలో వెల్లడించారు. చనిపోయిన వ్యక్తికి పాజిటివ్ ఉందని..ప్రసార మాధ్యమాల్లో వచ్చాయన్నారు. దీనివల్ల చాలా ఆందోళన చెందుతున్నారని, కేంద్రం, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారని తెలిపారు. అయితే..కేంద్రం ఎక్కడా చర్యలు తీసుకోవడం కనిపించడం లేదని, కేవలం ఒక్క రింగ్ టోన్ పెట్టేసి వదిలిపెట్టేసిందని ఆరోపించారు. వైరస్‌పై చాలా అపోహాలున్నాయని, ఒక పారసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటే..అయిపోతదని..మొన్న సీఎం కేసీఆర్ చెప్పారని సభలో వెల్లడించారు. 

KCR స్ట్రాంగ్ రిప్లై : – 
దీనికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్‌గా రెస్పాండ్ అయ్యారు. ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తున్నారని పరోక్షంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారని, ఇంతకన్నా దిక్కుమాలిన స్టేట్ మెంట్ చూడమన్నారు. ప్రతిపక్షాల సభ్యులు నినాదాలు చేయడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో చచ్చినోళ్లు ఇద్దరు..135 కోట్ల మంది ఉండే దేశంలో…ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకింది…65 మందికి మాత్రమేనన్నారు. దీనిపై అందరూ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ‘మన దగ్గర ఉత్పాతం రాలేదు..భయపెట్టాల్సిన అవసరం ఉందా ? అనవసరమైన చర్చలకు దారి తీసి…వివాదాలు తె చ్చుకుని..పార్టీని కంపు చేసుకోవడం..తప్పా ఏమీ రాదు..గిసొంటి వాళ్లు మాట్లాడితే..పట్టించుకోం..మా పని మేము చేస్తాం..ప్రజలకు ఎలాంటి భయాలు, ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు అంటూ కేసీఆర్ భరోసా ఇచ్చారు. 

Read More : నాకు కరోనా లేదు : హైదరాబాద్‌కు కర్నూలు యువతి అన్నం జ్యోతి