Srinivas Goud : బీజేపీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో ఆ డిక్లరేషన్ అమలవుతుందో చెప్పాలి- మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud : బీసీ నాయకుడు ప్రధాని అయితే బీసీల బతుకులు బాగుపడతాయని అనుకున్నాం. కానీ, బీసీ నాయకుడు ప్రధాని అయ్యాక కనీసం బీసీ గణన కూడా నోచుకోలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాపోయారు.

Srinivas Goud(Photo : Twitter)

BJP BC Declaration : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ ట్రిక్కులు తెలంగాణలో పని చేయవు అన్నారు. బీజేపీ బీసీ డిక్లరేషన్ ఎన్నికల స్టంట్ మాత్రమే అన్నారు. బీజేపీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ అమలు అవుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ నాయకుడు ప్రధాని అయితే బీసీల బతుకులు బాగుపడతాయని  అనుకున్నాం. కానీ, బీసీ నాయకుడు ప్రధాని అయ్యాక కనీసం బీసీ గణన కూడా నోచుకోలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాపోయారు.

Also Read..Telangana Elections 2023: సెప్టెంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్.. ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్

” బీసీ నాయకుడు ప్రధానిగా ఉన్న కేబినెట్ లో బీసీ మంత్రిత్వ శాఖ ఉండదా? బీసీ డిక్లరేషన్ కరెక్ట్ గా ఉంటే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చేది. కర్ణాటక రాష్ట్రంలో బీసీలను అణగదొక్కారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు ఇవ్వండి. మేమే మీ వెంట బీసీలను తిప్పుతాం. తెలంగాణ రాష్ట్రంలోని ఒక కులానికి కేటాయించిన బడ్జెట్.. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలకు కేంద్ర బడ్జెట్ లేదు. దేశవ్యాప్తంగా 80కోట్ల మంది ఓబీసీలు ఉంటే.. 2వేల కోట్లే కేటాయిస్తారా?

ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు అభినవ పూలే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాట అంటేనే డిక్లరేషన్. బీజేపీ ట్రిక్కులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయవు. దేశంలోని బీసీలు.. కనీసం బ్యాంకులను మోసం చేసిన వాళ్ళ లెక్కల్లో కూడా లేరు. బీసీ ప్రధాని పేరుకు మాత్రమే. ఆయన దగ్గర పెన్ పవర్ లేదు. మా జిల్లాలో గొర్ల పరిశోధన కేంద్రం నిర్మాణం జరుగుతోంది. ఎంత భూమి ఉందో అంతే భూమి అక్కడే ఉంది. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు బయటపెట్టకుండా అడ్డుకుందే బీజేపీ నాయకులు. నేను కూడా ఒక దళితుడిని. దళితుడు అంటే అణగారిన వర్గం. నేను అనంది మార్ఫింగ్ చేశారు. చేసిన వాళ్ళ పై కేసులు నమోదయ్యాయి” అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Also Read.. YS Sharmila : ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారు : వైఎస్ షర్మిల