తిరుమల సెల్ఫ్ డిక్లరేషన్ వివాదం : మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు

ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల ఆలయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను బీజేపీ నేతలు, హిందుత్వ సంఘాల నాయకులు

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 10:23 AM IST
తిరుమల సెల్ఫ్ డిక్లరేషన్ వివాదం : మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు

Updated On : November 20, 2019 / 10:23 AM IST

ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల ఆలయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను బీజేపీ నేతలు, హిందుత్వ సంఘాల నాయకులు

ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల ఆలయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను బీజేపీ నేతలు, హిందుత్వ సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా మంత్రి కొడాలి నాని మాట్లాడారని మండిపడుతున్నారు. తిరుపతి, విజయవాడలో మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలన్నారు.

తిరుమల ఆలయ ప్రవేశానికి సంబంధించి సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా సీఎం జగన్ కు ఏ గుడికైనా, మసీదుకైనా, చర్చికైనా వెళ్లే అధికారం ఉందని కామెంట్ చేశారు. ఎవడికి సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి.. పిచ్చి వాగుడు.. అంటూ చంద్రబాబుని ఉద్దేశించి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేతలు, హిందూవాదులు తప్పుపడుతున్నారు.