Rahul Gandhi-Lord Ram Row
Rahul Gandhi-Lord Ram Row: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని శ్రీ రాముడితో పోల్చుతూ ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ నేత గౌరవ్ భాటియా ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఎటువంటి రాజకీయాలు చేయడానికైనా వెనకాడదని చెప్పారు.
‘‘కాంగ్రెస్ పార్టీలోనే ఈ డీఎన్ఏ ఉంది. వారికి ఓట్లు కావాలంటే ఎటువంటి రాజకీయాలకైనా పాల్పడతారు. ఈ కారణం వల్లే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై బయట ఉన్న రాహుల్ గాంధీని మన ఆరాధ్య దేవుడు శ్రీ రాముడితో సల్మాన్ ఖుర్దీద్ పోల్చుతున్నారు. వారికి ప్రజలు సరైన రీతిలో సమాధానం చెబుతారు’’ అని గౌరవ్ భాటియా చెప్పారు.
బీజేపీ సిద్ధాంతాలు గెలుస్తున్నాయన్న విషయం అందరికీ స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. రాహుల్ గాంధీని రాముడితో పోల్చడం సరికాదని చెప్పారు. రాహుల్ ఒక కపట హిందూ అని ఆయన విమర్శించారు. ఎన్నికలు వస్తున్న సమయంలో ఆయన అలా మారతారని చెప్పారు. పీవీ నరసింహారావు, సీతారం కేసరి కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవాన్ని ఎందుకు పొందలేకపోయారని గౌరవ్ భాటియా ప్రశ్నించారు. అంతేగాక, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, బీఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేదని చెప్పారు.
Vijay Devarakonda: ‘ఖుషి’ని పక్కనబెట్టి ఆటలాడుతానంటోన్న దేవరకొండ.. నిజమేనా?