Ramesh Bidhuri: బీఎస్పీ ఎంపీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరికి ఉన్నత బాధ్యతలు

బిధూరి వివాదాస్పద ప్రకటన తర్వాత, లోక్‌సభ రికార్డుల నుండి వివాదాస్పద భాగాన్ని తొలగించారు. అదే సమయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బిధూరితో మాట్లాడారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన.. రమేశ్ బిధూరి భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు

Ramesh Bidhuri: బీఎస్పీ ఎంపీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరికి ఉన్నత బాధ్యతలు

Ramesh Bidhuri: బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీపై భారతీయ జనతా పార్టీ నేత రమేశ్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఈ అంశంపై రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. రమేశ్ బిధూరిపై చర్యలు తీసుకోవాలంటూ డానిష్ అలీ సహా విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి బీజేపీకి కూడా ఈ కాంట్రవర్సీ కారణంగా చిక్కుల్లో పడ్డట్టే కనిపించింది. కానీ, తాజాగా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇందకు పూర్తి విరుద్ధంగా కనిపించింది.

రమేశ్ బిధూరిపై చర్యలు తీసుకోకపోగా.. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్ కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ జిల్లా టోంక్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. బిధూరి ఢిల్లీలోని దక్షిణ ఢిల్లీ స్థానం నుంసీ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. కాగా, డానిష్ అలీపై చేసిన వ్యాఖ్యల అనంతరం.. బిధూరికి బీజేపీ నోటీసు ఇచ్చింది. బిధురి ఈ నోటీసుకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. అయితే దీనితో పాటే టోంక్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

రమేష్ బిధూరి ఏమన్నారు?
లోక్‌సభలో చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రమేష్ బిధూరి అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో నాలుగో రోజు లోక్‌సభలో చంద్రయాన్-3 విజయంపై బిధూరి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కొన్ని ప్రశ్నలు సంధించారు. దీనిపై బీజేపీ ఎంపీ దుర్భాషలాడారు. బిధురి తనతో ఈ అసభ్యకరమైన మాటలు మాట్లాడిందని డానిష్ అలీ చెప్పారు. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

ఆ వ్యాఖ్యల తర్వాత ఏం జరిగింది?
బిధూరి వివాదాస్పద ప్రకటన తర్వాత, లోక్‌సభ రికార్డుల నుండి వివాదాస్పద భాగాన్ని తొలగించారు. అదే సమయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బిధూరితో మాట్లాడారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన.. రమేశ్ బిధూరి భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అదే సమయంలో బిధూరికి బీజేపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ప్రస్తుతం టోంక్ జిల్లాలోని టోంక్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నుంచి యూనస్‌ఖాన్‌ను బరిలోకి దింపింది. యూనస్ ఖాన్ అంతకు ముందు వసుంధర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. టోంక్ ముస్లిం ప్రాబల్యం ఉన్న సీటు కావడం గమనార్హం.

రమేష్ బిధూరి తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో..
బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కొంతకాలం క్రితం, పాఠశాల సమస్యతో తల్లిదండ్రులు ఆయనను సంప్రదించినప్పుడు, తనకు ఎందుకు పిల్లలు పుట్టారని బిధూరి అడిగారు. బిధూరి చేసిన ఈ వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశమయ్యాయి. అంతకుముందు, ముస్లింలు ఎక్కడ మైనారిటీగా ఉన్నారో అక్కడ మానవ హక్కుల గురించి మాట్లాడతారు, వారు ఎక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారో అక్కడ రక్తపాతం మొదలవుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి.