BJP Alliance : పొత్తా? సింగిలా? ఏపీ బీజేపీ ముఖ్య నేతలతో శివప్రకాశ్ భేటీ

పార్టీకి బలం ఉన్న స్థానాలను ప్రత్యేకంగా శివప్రకాశ్ నోట్ చేసుకుంటున్నారు.

Bjp Key Meeting On Alliance

BJP Alliance : విజయవాడలో బీజేపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ నేత శివప్రకాశ్ భేటీ అయ్యారు. నేతలతో ఆయన విడివిడిగా భేటీ అవుతున్నారు. పొత్తులు లేకుండా పోటీ చేయగలమా? లేదా? అన్న అంశంపై శివప్రకాశ్ ఆరా తీస్తున్నారు. పార్టీకి బలం ఉన్న స్థానాలను ప్రత్యేకంగా శివప్రకాశ్ నోట్ చేసుకుంటున్నారు.

బీజేపీ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతోంది. ఉదయం నుంచి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలు, కన్వీనర్లతో బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్ భేటీ అయ్యారు. జిల్లాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. పొత్తులు లేకుండా వెళితే ఎన్ని సీట్లు సాధించవచ్చు? పొత్తు ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అనే అంశాలపై ప్రతి నేత దగ్గర శివప్రకాశ్ ఆరా తీసినట్లు సమాచారం.

మూడు నాలుగు రోజుల్లో పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఏయే నియోజకవర్గాల్లో బీజేపీకి బలం ఉంది? నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలేంటి? ఏ అభ్యర్థి అయితే బెటర్? అనే అంశాలు చర్చకు వస్తాయన్నారు. కాగా, పొత్తులు అంటూనే టీడీపీ-జనసేన కూటమి సీట్లను ప్రకటించడం ఏంటి? అని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పొత్తుల అంశంపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. పని చేస్తామని మరికొందరు నేతలు తమ అభిప్రాయం వెల్లడించారు.

Also Read : టీడీపీ-జనసేన కూటమితో పొత్తు, పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ

* ఉదయం 6 గంటల నుంచి సాగుతున్న భేటీ
* విడివిడిగా నేతలతో శివప్రకాశ్ సమావేశం, పొత్తులపై అభిప్రాయాల సేకరణ
* పార్టీకి బలమున్న స్థానాలను ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నారు
* పొత్తులు అంటూనే టీడీపీ-జనసేన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం ఏంటి? అని శివప్రకాశ్ దృష్టికి తీసుకెళ్లిన పలువురు రాయలసీమ నేతలు
* పొత్తు లేకుండా పోటీ చేస్తే పోటీకే పరిమితం అవుతాము తప్ప సీట్లు గెలవలేమని మరికొందరు నేతల అభిప్రాయం
* పొత్తుల అంశంపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పని చేస్తామన్న మరికొందరు నేతలు
* పొత్తుల విషయంలో జాప్యం చేయకుండా క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న మెజార్టీ నేతలు

 

 

ట్రెండింగ్ వార్తలు